విధాత, యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ స్లీవరాజ్‌ను జిల్లా విద్యాధికారి నారాయణరెడ్డి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
కేంద్ర బృందం ఇటీవల మధ్యాహ్న భోజనం పథకం తనిఖీకి వచ్చిన సందర్భంలో భోజన పథకం అధ్వానంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ స్లీవరాజును సస్పెండ్ చేసినట్లు డీఈవో తెలిపారు.