విధాత, హైదరాబాద్: కొల్లాపూర్‌లో ఈనెల 31వ తేదీన నిర్వహించే పాలమూరు ప్రజాభేరి సభకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ముఖ్యతిధిగా హాజరవుతున్నారు. ఈ మేరకు ఆదివారం సభ ఏర్పాట్లపై పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి నివాసంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మల్లురవి, జగదీశ్ రావు, ప్రతాప్ గౌడ్, విజయ భాస్కర్ రెడ్డిలు సమావేశమయ్యారు. భారీ ఎత్తున ప్రజలు సభకు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా ప్రజలకు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
అనంతరం జూపల్లి, మల్లు రవి, జగదీశ్వర్ రావులు మాట్లాడుతూ పాలమూరు ప్రజా భేరి సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున వచ్చి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ కు తెలంగాణ లో గెలిపించి బహుమతి ఇవ్వాలన్నారు. ప్రజా కంఠక కేసీఆర్ పాలనకు ప్రజలు చరమ గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు.