విధాత, ఉమ్మడి,మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :కాంగ్రెస్ , బీజేపీ నేతల మధ్య ప్రోటోకాల్ రగడ తో ఘర్షణ వాతావరణం నెలకొంది.శనివారం మక్తల్ నియోజకవర్గం లోని నర్వ మండల కేంద్రం లో కొత్తగా నిర్మించిన వ్యవసాయపరపతి సంఘం భవన ప్రారంభోత్సవం కార్యక్రమాని ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రారంభోత్సవ శిలాపలకం పై బీజేపీ ఎమ్మెల్సీ వైవీన్ రెడ్డి పేరులేకపోవడం, మండల కాంగ్రెస్ అధ్యక్షుని పేరు ఉండడంతో ఎంపీ అరుణ,బీజేపీ నాయకులు ఎమ్మెల్యే శ్రీహరి నిలదీశారు.ఒక ఎమ్మెల్సీ పేరు లేకుండా, పార్టీ మండల అధ్యక్షుని పేరు ఉండడం ఇదేమి సంస్కృతి అని అరుణ మండిపడ్డారు. దీంతో బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.ఇరు పార్టీ ల నాయకుల, కార్యకర్తలమధ్య మాటల యుద్ధం జరిగింది. అధికార పార్టీ నేతలు చెప్పినంత మాత్రాన ఎమ్మెల్సీ పేరు పెట్టారా అని అరుణ సంబందిత అధికారులపై మండిపడ్డారు. ఎమ్మెల్యే శ్రీహరి కల్పించుకుని గొడవ ను సద్దుమణిగించారు. అనంతరం అరుణ కాంగ్రెస్ ఎమ్మెల్యే పై ఆగ్రహం చెంది భవన ప్రారంభోత్సవం లో పాల్గొనకుండా వెళ్లిపోయారు.