రాహుల్ నిజామాబాద్ సభ వాయిదా

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం నిర్వహించాల్సిన నిజామాబాద్ బహిరంగ సభ వాయిదా పడింది

విధాత : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం నిర్వహించాల్సిన నిజామాబాద్ బహిరంగ సభ వాయిదా పడింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అత్యవసర పనుల నేపధ్యంలో రాహుల్ గాంధీ ఆర్మూర్ లో పసుపు రైతులతో భేటీయై, ఇక్కడి సభ ముగిసిన వెంటనే ఢిల్లీకి వెళ్లిపోతారు. బస్సుయాత్ర తొలి దశ నేటితో ముగిసిపోనుండగా, రెండో దశ దసరా తర్వాతా నిర్వహించనున్నారు. రెండో దశ బస్సు యాత్రలో ప్రియాంక గాంధీ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.