విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపధ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు శనివారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలు, పార్టీ అనుసరించిన వ్యూహాలపై ఆయన నేతలతో చర్చించి తగిన మార్గదర్శకం చేశారు. అభ్యర్థులు లెక్కంపు సందర్భంగా కౌంటింగ్ సెంటర్లు వదిలిపెట్టవద్దని, హైద్రాబాద్‌కు ఎవరు రావద్దని రాహుల్ సూచించారు. కౌంటింగ్‌లో ఏమైన ఇబ్బందులు ఎదురైతే వెంటనే రాష్ట్ర నాయకులకు తెలుపాలని, అభ్యర్థులకు రాష్ట్ర నాయకులు అందుబాటులో ఉండాలని తెలిపారు.
జూమ్ మీటింగ్‌లో ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. మరోవైపు ఫలితాల సందర్భంగా పార్టీ అభ్యర్థుల సమన్వయం, పర్యవేక్షణ కోసం హైకమాండ్ ఆదేశాలతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి జార్జ్ లు హైద్రాబాద్ తాజ్ కృష్ణకు చేరుకున్నారు. గెలిచే అభ్యర్థుల కోసం తాజ్ కృష్ణలో కాంగ్రెస్ ఇప్పటికే 50 గదులను బుక్ చేసింది.