Rahul Sipligunj | విధాత, హైదరాబాద్ : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాట ద్వారా ఆస్కార్ స్థాయి వరకు ఎదిగిన హైదరాబాద్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది. ఆదివారం బోనాల పండుగ వేడుక నేపథ్యంలో రాహుల్ సిప్ల్ గంజ్ కు కోటి నగదు పురస్కారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ సిప్లిగంజ్‌కు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంలో సైతం రాహుల్ సిప్లిగంజ్ పేరును ప్రస్తావిస్తూ త్వరలోనే ఆయనను సత్కరించేలా ప్రభుత్వ ప్రకటన ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి గతంలో తను ఇచ్చిన మాట మేరకు సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా ప్రకటించి హామీ నిలబెట్టుకున్నారు.