విధాత, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ (Ranga Reddy land records) అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్(AD Srinivas)పై ఏసీబీ (ACB raids) సోదాలు నిర్వహిస్తుంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసు(disproportionate assets)లో శ్రీనివాస్ ఇంటిపైన, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపైన,బినామీల ఇళ్లలో ఏసీబీ బృందాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ , రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో, బాలానగర్ లో సోదాలు సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు రాయ్ దుర్గలోని మైహోంభూజాలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
సోదాల్లో ల్యాండ్ రికార్డ్స్ ఏడీగా శ్రీనివాస్ పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది. మహబూబ్ నగర్ లో ఒక రైస్ మిల్లును కూడా అధికారులు తనిఖీల్లో గుర్తించారు.
పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సోదాల అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
