లంచం సొమ్ముతో ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్ఐ

మాదాపూర్ ఎస్ఐ వినయ్, జైలు నుంచి తప్పించేందుకు రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రాష్ట్రంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.

Madhapur SI

విధాత, హైదరాబాద్ : మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వినయ్ ఏసీబీ నిర్వహించిన దాడుల్లో రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ఓ చీటింగ్ కేసులో జైలు నుంచి తప్పించేందుకు రూ.50 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ ఉచ్చులో భాగంగా ఎస్ఐ వినయ్ బాధితుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.

రాష్ట్రంలో ఏసీబీ అధికారులు వరుసదాడులతో హోరెత్తిస్తున్నారు. సగటున రోజుకొక్క అవినీతి అధికారులను, ఉద్యోగులను పట్టుకుంటూ కేసుల నమోదుతో జోరుమీదున్నారు. అయితే ఏసీబీ కేసుల విచారణ నత్తనడకన సాగడం, కోర్టులలో వీగిపోతుండటం ఎక్కువగా జరుగుతుండటంతో అవినీతి అధికారులకు అడ్డుకట్ట పడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

HYDRA : ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం..రూ.1511 కోట్ల భూముల పరిరక్షణ
Srisailam : శ్రీశైలంలో శివ భక్తుల గోస..గ్రామోత్సవం రద్దు!

Latest News