Revanth Reddy Meets Mallikarjun Kharge | నేడు మల్లిఖార్జున్ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

సీఎం రేవంత్ రెడ్డి నేడు బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను పరామర్శించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి, బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం ఉంది.

Revanth reddy

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం బెంగుళూరుకు వెళ్లనున్నట్లుగా సమాచారం. బెంగుళూరులో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను సీఎం పరామర్శించనున్నారు. ఇటీవల మల్లిఖార్జున్ ఖర్గేకు వైద్యులు ఫేస్ మేకర్ అమర్చారు. ఈ నేపథ్యంలో ఖర్గేను రేవంత్ రెడ్డి పరామర్శిస్తారు.

ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక అంశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంపై కోర్టుల విచారణ అంశాలను ఖర్గేకు వివరించనున్నారని సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కోసం పీసీసీ నలుగురి పేర్లను ఏఐసీసీకి పంపించిన సంగతి తెలిసిందే. అటు సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ..ఈ అంశంపై హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. రిజర్వేషన్ల అంశంపై ఈనెల 8న హైకోర్టులో విచారణ కొనసాగనుంది. హైకోర్టు నిర్ణయంపైనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంది.

 

Exit mobile version