Secunderabad Temple: సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిని ధ్వంసం చేసిన దుశ్చర్యలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతడు మహరాష్ట్రకు చెందిన సల్మాన్ సలీమ్ ఠాకూర్(Salman Saleem Thakur)) అలియాస్ సల్మాన్(30)గా ప్రకటించారు. ఒక వ్యక్తిత్వ శిక్షణాశిబిరంలో పాల్గొనేందుకు నెల క్రితం నగరానికి వచ్చిన సల్మాన్ యూట్యూబ్, ఇతర ఆన్లైన్ ఆడియో, విడియోలలో మత విద్వేష ప్రసంగాలు(speeches of Islamic speakers) చూసి, విని ఇతర మతాల పట్ల విద్రోహ మనస్తత్వాన్ని అలవరచుకున్నాడు.
మహారాష్ట్రలోని ముంబ్రా(Mumbra, Maharashtra))కు చెందిన సల్మాన్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడు. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండేవాడు. యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి వాటిలో బహిష్కృత ముస్లిం వేర్పాటువాద నాయకుడు జకీర్ నాయక్(Zakir Naik) లాంటి వారి ప్రసంగాలతో తీవ్రంగా ప్రభావితమయ్యాడు. తనను తాను అన్యమతద్వేషి(radical mindset)గా మలుచుకుని, ఇతర మతాలను అవమానించే కార్యక్రమాలను రూపొందించుకుని ఒక్కడే అమలు చేసేవాడని పోలీసులు తెలిపారు.
ప్రాథమికి విచారణ ప్రకారం, రెజిమెంటల్ బజార్‌లోని ఓ హోటల్(Hotel)లో మునావర్ జమా, మహమ్మద్ కఫీల్ అహ్మద్ తదితరులు ఒక నెల రోజుల పాటు నిర్వహించే వ్యక్తిత్వ వికాస శిక్షణా శిబిరం()లో పాల్గొనడానికి సల్మాన్(Salman) అక్టోబర్ మొదటివారంలో నగరానికి వచ్చాడు. ఆ శిక్షణా కార్యక్రమ నిర్వహణకు ఎటువంటి అనుమతి(illegal program) లేదని, ఆ హోటల్లో హాల్ అక్రమంగా అద్దెకు తీసుకుని ఆ శిబిరాన్ని నడిపిస్తున్నారని, హోటల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెప్పారు.
పోలీసు వర్గాల కథనం ప్రకారం, సల్మాన్ ఇంతకుముందు కూడా ముంబయి(Mumbai)లో ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడని, 2022లో ఒక గణేశ మండపం(Ganesh Pandal)లోకి చెప్పులతో చొరబడి, విగ్రహారాధనపై నిర్వాహకులతో తీవ్రంగా గొడవపడ్డాడని, 2024లోనే మీరా రోడ్డు(Mira Road)లోని ఒక గుళ్లో విగ్రహాన్ని ధ్వంసం చేసాడని తెలిసింది. నగర పౌరులు పుకార్ల పట్ట జాగ్రత్తగా ఉండాలని, కేసు ఇంకా దర్యాప్తులో ఉన్నందున ప్రజలు శాంతిభద్రతలను కాపాడటంలో తమకు సహకరించాలని పోలీసులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు.