రోడ్డు ప్రమాదాల నివారణకు ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణ: క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌

విధాత, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి రంగనాథ్ వెల్లడించారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల కాలంలో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా భీంపల్లి క్రాస్ రోడ్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులు, ఆర్అండ్ బి, స్థానిక ప్రజా ప్రతినిధులతో […]

  • Publish Date - January 4, 2023 / 12:18 PM IST

విధాత, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి రంగనాథ్ వెల్లడించారు.

కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల కాలంలో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిసారించారు.

ఇందులో భాగంగా భీంపల్లి క్రాస్ రోడ్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులు, ఆర్అండ్ బి, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సి చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.

ముఖ్యంగా వాహనాల వేగాన్ని తగ్గించేందుకుగాను స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్, సైన్ బోర్డు భీంపల్లి క్రాస్ వద్ద డివైడర్ల ఏర్పాటు చేయడంతో పాటు, సర్వీసు రోడ్ నుండి ప్రధాన రోడ్లు కలిపే సర్వీసు రోడ్లపై సైతం డివైడర్ల ఏర్పాటు చేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక ఇంజనీరింగ్ విభాగం ఏర్పాటు చేశామని చెప్పారు. తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఈ విభాగంలో పరిశీలించి రోడ్డు ప్రమాదాలకు గల కారణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలుపై ఈ నివేదిక అందజేస్తారని తెలిపారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులకు అదేశించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

కార్య‌క్రమంలో కాజీపేట ఏసిపి శ్రీనివాస్, రోడ్డు భవనాల డి. ఇఇ గౌస్, కమాలాపూర్ ఇన్స్‌పెక్టర్ సంజీవ్, ఇంజనీరింగ్ విభాగం ఇన్స్‌స్పెక్టర్ విజయ్ కుమార్, ఎస్.ఐలు, సతీష్, చరణ్, సర్పంచ్‌లు దేవేందర్ రావు, తిరుపతిరెడ్డి, ఉప్పల్ యం.పి.టి.సి సంపత్ రావు, పి.ఏ.సి.ఎస్ చైర్మెన్ సంపత్లారావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.