విధాత, సూర్యాపేట: బొట్టు పెడుతూ.. మ్యానిఫెస్టోను వివరిస్తూ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సతీమణి సునిత గురువారం సూర్యాపేట పట్టణంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
33వ వార్డులో ఇంటింటికీ వెళ్లి, మహిళలకు బొట్టు పెట్టి, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన జగదీశ్ రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. కేసీఆర్ పాలనలో మహిళకు పెద్ద పీట వేసిందన్నారు. రాబోయే రోజుల్లో మహిళలంతా బీఆర్ఎస్ కి అండగా ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.