మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి సునీతా లక్ష్మారెడ్డి రాజీనామా

విధాత : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. నర్సాపూర్ అసెంబ్లీ స్థానం బీఆరెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నేపధ్యంలో ఆమె రాజ్యంగ బద్ధ పదవియైన మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. సునీతా లక్ష్మారెడ్డి రాజీనామాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆమోదిస్తు ఉత్తర్వులు జారీ చేశారు.


సునీతా లక్ష్మారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2020డిసెంబర్ 27న ఏర్పాటైన తెలంగాణ మహిళా కమిషన్ తొలి చైర్మన్‌గా ఆమె నియామితులయ్యారు. ఆమె రాజీనామాతో ఖాళీయైన మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవీ భర్తీ ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే ఉండనుంది.