మెదక్: కరోనా బాధితులకు అండగా నిలుస్తోంది వాకిటి లక్ష్మారెడ్డి మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలోని ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలోని రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు ఐదు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను పంపిణీ చేశారు. శివంపేట ఆసుపత్రికి ఒకటి, నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి నాలుగు కాన్సన్ ట్రేటర్లను అందించారు. కరోనాను జయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తోందని… బాధితుల కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి సునీతా లక్ష్మారెడ్డి వివరించారు. కరోనా రోగుల కోసం తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.