విధాత : ఖైరతాబాద్ రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై సమావేశం ప్రారంభమైంది.
సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆఫీస్ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధి కారులు పాల్గొన్నారు.
బస్సు చార్జీలు ఈ కింది విధంగా పెరగనున్నాయి.
పల్లెవెలుగు బస్సులకు కిలోమీటర్ కు 25 పైసలు..
Expressలపై సర్వీసులకు 30 పైసలు పెంపు.
సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు
మెట్రో డీలక్స్ సర్వీసులకు 30 పైసలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తరువాత అధికారికంగా ఆర్టీసీ యాజమాన్యం పరకటించనుంది.