Site icon vidhaatha

Phone Tapping Case | ట్యాపింగ్ కేసులో సంయమనం పాటించండి.. పోలీసులకు హైకోర్టు కీలక సూచనలు

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంయమనం పాటించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బుధవారం విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్దాంతం చేయొద్దని, జడ్జిలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు బహిర్గతం చేయొద్దని స్పష్టం చేసింది. ఫోన్ నంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 23కి వాయిదా వేసింది.

రాజకీయ నేతలతో పాటు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని పత్రికల్లో కథనాలు రావడంతో ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసింది. కేసు విచారణ జరుగుతోందని, నిందితులను అరెస్టు చేసినట్టు కౌంటర్‌లో పేర్కొంది. పలువురు పోలీసు అధికారుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్టు తెలిపింది.

Exit mobile version