తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడి

తెలంగాణ ఇంటర్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు.

  • Publish Date - April 24, 2024 / 12:45 PM IST

ప్రథమ సంవత్సరంలో 60.1శాతం
ద్వితీయ సంవత్సరంలో 64.19శాతం ఉత్తీర్ణత
ఫలితాల్లో బాలికలదే హవా

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ప్రధమ సంవత్సరంలో 60.01శాతం, ద్వితీయ సంవత్సరంలో 64.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్లో 2.87లక్షల మంది. సెకండియర్‌లో 3.22 లక్షల మంది విద్యార్థులు పాసయ్యారు. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఫస్టియర్‌లో బాలికలు 68.35 శాతం, బాలురు 51.5 శాతం ఉత్తీర్ణత సాదించారు. సెకండియర్‌లో బాలికలు 72:53 శాతం, బాలురు 56.1 శాతం ఉత్తీర్ణత సాధించారు.

మొదటి సంవత్సరం ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో. మేడ్చల్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. ద్వితీయ సంవత్సరంలో ములుగు మొదటి స్థానంలో.. మేడ్చల్ ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. ఇక గ్రూప్‌ల వారీగా చూస్తే ఫస్టియర్ ఎంపీసీలో 68.52 శాతం, బైపీసీలో 67.34 శాతం, సీఈసీలో41.73 శాతం, హెచ్‌ఈసీలో 31.57 శాతం, ఎంఈసీలో 50.51 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా సెకండియర్ ఎంపీసీలో 73.85 శాతం, బైపీసీలో 67.52 శాతం, సీఈసీలో 44.81 శాతం, హెచ్‌ఈసీలో 43.51 శాతం, ఎంఈసీలో 59.93 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఫ‌లితాల కోసం ఇక్క‌డ  https://tsbie.cgg.gov.in/bieresultlivebti.do క్లిక్ చేయండి.

Latest News