హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విధాత): రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నుంచి ఆరు నెలల జీతాలు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 19వ తేదీన బేగంపేటలోని ప్రజా దర్బార్ కు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలంగాణ జేఏసీ కమిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ తెలిపింది. ఏజెన్సీ వ్యవస్థను రద్ధు చేసి ఉద్యోగ భద్రత ఇస్తూ, ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసింది. వివిధ సొసైటీలు, ప్రభుత్వ శాఖలలో సుమారు రెండు లక్షల మంది వరకు పనిచేస్తుండగా, తమ సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జేఏసీ పేర్కొన్నది. చనిపోయిన ఉద్యోగులకు రూ.10 లక్షలు ఎక్ర్ గ్రేషియా చెల్లించాలి, పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలి, తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్లతో చలో ప్రజా దర్భార్ కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ జేఏసీ కమిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ప్రెసిడెంట్ పులి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శులు డీ.శ్రీధర్, డీ.శ్రీనివాస్ తెలిపారు.