విధాత: వైద్యరంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నాగార్జునసాగర్ లోని కమలా నెహ్రూ హాస్పిటల్ లో 70 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించి మాట్లాడారు.
తెలంగాణలో ఒకే ఏడాది 8 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామని, వచ్చే ఏడాది మరో ఎనిమిది మెడికల్ కాలేజ్ లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఎంబిబిఎస్ సీట్లలో మొదటి స్థానంలో, పీజీ వైద్య సీట్లలో రెండవ స్థానంలో ఉందన్నారు.
తెలంగాణ రాకమందు మూడు డయాలసీస్ కేంద్రాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్యను 102 కు పెంచామన్నారు. ఇప్పటిదాకా 50 లక్షల డయాలసిస్ సెషన్లు పూర్తి చేశామన్నారు. కిడ్నీ రోగులకు బస్సు పాస్, అసరా పెన్షన్లను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్తగా 950 మంది డాక్టర్లను నియమించడం జరిగిందన్నారు. నల్గొండ జిల్లా కే 42 మందిని నూతన డాక్టర్ లను కేటాయించమన్నారు . కంటి వెలుగు పథకం ద్వారా ఈనెల 18 నుంచి జిల్లాలో 74 బృందాలతో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, డి ఎం హెచ్ ఓ ఏకే రావు, డి సి హెచ్ ఎస్ మాతృ నాయక్ తదితరులు పాల్గొన్నారు.