విధాత, హైదారాబాద్ : తెలంగాణలో వాతావరణం విభిన్న మార్పులతో కొనసాగుతుంది. శనివారం నుంచి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ చేసిన ప్రకటన ఆసక్తి రేపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
సంక్రాంతి పండుగ ముందు వరకు విపరీతమైన చలితో వణికించిన వాతావరణం..భోగి పండుగ రోజున చిరుజల్లులతో మారిపోయింది. ఈ క్రమంలో వెల్లడించిన వెదర్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో వర్షాలు పడే చాన్స్ ఉండటంతో ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని వాతావరణంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.
ఒకవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా తమ స్వస్థలాలకు వెళ్లిన జనం.. వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటనతో తిరుగు ప్రయాణాలకు సిద్దమవ్వడంతో రోడ్లన్ని వాహనాల రాకపోకలతో రద్దీగా మారుతున్నాయి. సంక్రాంతి వరకు చలి.ఇప్పుడు వర్షాలు ఇదెక్కడి వెదర్ ట్విస్టులురా బాబు..అనుకుంటూ ఉద్యోగ ప్రాంతాలకు తరలివస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది తెలంగాణలో వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉండబోతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రాష్ట్రంలోని విభిన్న వాతావరణ మార్పులకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ వేసవి ఎండలు ఫిబ్రవరి తొలి వారం నుంచే దంచి కొట్టబోతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేయడం ఆసక్తికరం.
ఇవి కూడా చదవండి :
Road Accident : పాఠశాలకు వెలుతున్న కారు బోల్తా..ఇద్దరు టీచర్ల దుర్మరణం
BRS Rally : సికింద్రాబాద్ బచావో బీఆర్ఎస్ ర్యాలీ ఉద్రిక్తత !
