TG SET | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్‌కు అర్హత సాధించేందుకు నిర్వహించే టీజీ సెట్( TG SET ) – 2025 పరీక్షా తేదీలు ఖరారు అయ్యాయి. డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ వెల్లడించారు. మొత్తం 29 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇక దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 14. డిసెంబర్ 3వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తదితర వివరాల కోసం www.osmania.ac.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. ఇతర వివరాలకు 0040-27097733, 8331040950 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
