ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలో ఉన్న రేవంత్ మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై స్పంధించారు. నాణ్యత లోపం వల్లనే మేడిగడ్డ ప్రమాదం జరిగిందన్నారు. లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమేనన్నారు. మేడిగడ్డ బ్యారేజిజ్ కుంగడం పై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ తరపున డమాండ్ చేస్తున్నానన్నారు. కేంద్ర హోంమంత్రి, గవర్నర్ ,ఎన్నికల కమిషన్ మెడిగడ్డ పై విచారణకి ఆదేశించాలన్నరు.
మెడిగడ్డకు వెళ్లి బ్యారేజీని పరిశీలించడానికి అనుమతి ఇవ్వాలని ఈసీకి లేఖ రాస్తామన్నారు. మంత్రులు కేటీఆర్ ,హరీష్ రావు మాతో కలిసి మెడిగడ్డకు రావాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కిషన్ రెడ్డిలు మెడిగడ్డలో పర్యటించాలని డిమాండ్ చేశారు.ప్రైవేట్ కంపెనీలు నిర్మించాయని మాకు సంబంధం లేదని ప్రభుత్వం అనడం సరికాదన్నారు. సంఘవిద్రోహక శక్తులు ఉన్నాయా, మానవ తప్పిదం వల్ల ప్రమాదం జరిగిందా దర్యాప్తు జరగాలని రేవంత్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని అడిగారు.