విధాత, హైదరాబాద్: బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎంఐఎం పోటి చేయని స్థానాల్లో బీఆరెస్‌కు సపోర్ట్ చేస్తుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గతంలో వెల్లడించారు. ఎంఐఎంకు అడ్డాలాగా ఉన్న దారుస్సాలాం గోషామాల్‌లోనే ఉన్నది. అటువంటి ప్రదేశంలో రాజాసింగ్ గెలవటం ఏంటని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, ఎంఐఎం రెండు ఒక్కటేనని, వారు చీకటి దోస్తులని ఆరోపించారు.
ఎంఐఎం మద్దతుతోనే బీజేపీ గోషామాల్‌లో గెలిచిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మూడు పార్టీలు ఒక్కటై తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఎంఐఎం నిజంగానే మైనార్టీల బాగు కోరుకుంటే మైనారిటీ నేత షబ్బీర్ అలీని గెలిపించకుండా వేరే వారిని గెలిపించాలని ఎందుకు కోరుకుంటుందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.