విధాత : పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కోడంగల్‌తో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో కూడా పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏఐసీసీ రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతం నుంచి కామారెడ్డిలో ప్రాతినిధ్యం వహిస్తున్న షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్భన్ నుంచి పోటీ చేయనున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రే శనివారం గాంధీభవన్‌లో నిజమాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ఈ నెల 6వ తేదీన కొడంగల్‌లో నామినేషన్ వేస్తారు. 8వ తేదీన కామారెడ్డిలో భారీ ర్యాలీతో వెళ్లి రేవంత్‌రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు.