విధాత:ఎంఎల్సీ పదవులపై నల్లగొండ గులాబి నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.మొన్నటి వరకు మండలి చైర్మెన్ గా వున్న గుత్తా నేతి విద్యాసాగర్ తో పాటు మరో ముగ్గురు నేతలు పోటీలో వున్నారు.మండలీలో ఖాళీగా వున్న ఏడు పదవులకోసం కేవలం నల్లగొండ జిల్లా నుండే ఐదుగురు నేతలు పోటీ పడుతుండడం గులాబీ గూట్లో ఆసక్తి కరంగా మారింది.మండలి చైర్మెన్ గుత్తా,వైస్ చైర్మెన్ విద్యాసాగర్ పదవి కాలం ముగిసిపోవడంతో ఎంఎల్ఎ కోటా ఎంఎల్సీ ఎన్నికలను కరోనా కారణంగా ఈసీ వాయిదా వేసింది మళ్లీ ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టత రాకపోయినప్పటికి గుత్తా సుఖేంర్ రెడ్డి కి నేతి విద్యాసాగర్ కు మళ్లీ పదవి దక్కుతుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది.ఇది ఇలా వుండగా కోదాడ మాజీ ఎంఎల్ఎ వేనేపల్లి చందర్ రావు,నకిరేకల్ మాజీ ఎంఎల్ఎ వేముల వీరేశం కూడా ఎం ఎల్ సి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో మాత్రం కేసీఆర్ ఎంసీ కోటిరెడ్డికి ఎంఎల్సీ ఇస్తానని సభలో చెప్పారు దీంతో కోటిరెడ్డికి ఎంఎల్సీ ఖాయమని గులాబి బాస్ చెప్పింది చేస్తారని నేతలు చర్చించుకుంటున్నారు.
Readmore:తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం కీలక భేటీ