విధాత: కాకతీయ శిల్పకళా వైభవం ఖండాంతరాలు దా టింది. అత్యద్భుత శిల్ప సంపదకు చిరునామాగా నిలిచిన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో వర్చువల్‌గా సమావేశ మైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసు కుం ది. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరి శీలనకు ఎంపికవగా.. మన దేశం నుంచి 2020 సంవత్సరా నికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. తెలుగు రాష్ట్రా ల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికా ర్డు సృష్టించింది. ములుగు జిల్లా పాలంపేటలో క్రీ.శ.1213 లో నిర్మితమైన అపురూప కట్టడం రామప్ప ఆలయం. శిల్పి రా మప్ప పేరుతో ఈకాకతీయ కట్టడం ప్రాచుర్యంలోకి వచ్చింది.”