విధాత : బిజెపికి ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి రాజీనామా చేశారు. ఆమె త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. 1998లో విజయశాంతి రాజకీయ ప్రస్థానం బిజెపి నుంచి మొదలైంది. 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసిన విజయశాంతి 2009 టిఆర్ఎస్ లో ఆ పార్టీని విలీనం చేశారు.
2014 లో కాంగ్రెస్లో చేరిన విజయశాంతి తిరిగి 2020లో మళ్ళీ బిజెపిలో చేరారు. 2009లో టిఆర్ఎస్ నుంచి మెదక్ పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికైన విజయశాంతి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. త్వరలో మెదక్ ఎంపీ టికెట్ హామీతో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.