నైపుణ్యాల వెలికితీత‌కు యువజనోత్సవాలు: కలెక్టర్ పమేలా సత్పతి

విధాత: యువతీ యువకుల క్రీడా, కళారంగాల నైపుణ్యాలను చాటేందుకు యువజనోత్సవాలు దోహదం చేస్తాయని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం భువనగిరి ఖిల్లా వద్ద జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలకు ఆమె హాజరై మాట్లాడారు. ప్రతి సంవత్సరం జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలను నిర్వహించడం జరుగుతుందని, కోవిడ్ కారణంగా గత మూడు సంవత్సరాలుగా పోటీలు నిర్వహించలేదనన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం నిర్వహించుకుంటున్నామని […]

  • Publish Date - January 4, 2023 / 12:30 PM IST

విధాత: యువతీ యువకుల క్రీడా, కళారంగాల నైపుణ్యాలను చాటేందుకు యువజనోత్సవాలు దోహదం చేస్తాయని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం భువనగిరి ఖిల్లా వద్ద జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలకు ఆమె హాజరై మాట్లాడారు.

ప్రతి సంవత్సరం జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలను నిర్వహించడం జరుగుతుందని, కోవిడ్ కారణంగా గత మూడు సంవత్సరాలుగా పోటీలు నిర్వహించలేదనన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

పోటీలలో ప్రథమ స్థానంలో వచ్చిన గ్రూప్ ను రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో చాలా మంది కళాకారులు ఉన్నారని, చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారని, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.

జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ధనంజయ మాట్లాడుతూ, జానపద నృత్యం, జానపద గీతం, అనే అంశాలలో పోటీలు నిర్వహించామ‌ని, సుమారు 20 గ్రూపులు హాజరయ్యాయని తెలిపారు. జానపద నృత్యంలో ర్యాకింగ్ డాన్స్ ఇనిస్టిట్యూట్ గ్రూప్ నుంచి సి.హెచ్. బాలరాజు, జాస్మిన్ గ్రూప్ నుంచి కె.చైతన్య, లిల్లీ గ్రూప్ నుంచి జి అనుశ్రీ, జానపదం గీతంలో ర్యాకింగ్ డాన్స్ ఇనిస్టిట్యూట్ గ్రూప్ నుంచి కె.మాధుర్యా, మహదేవ్ గ్రూప్ నుంచి కె.రమ్య విజేతలుగా గెలుపొందారన్నారు.

కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, భువనగిరి మండల పరిషత్ అధ్యక్షులు నిర్మలా వెంకటేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, జ‌డ్పీటీసీ బీరు మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.