యువజనోత్సవాలు.. ప్రతిభా ప్రదర్శనకు వేదికలు: చీఫ్‌ విప్ వినయ్‌భాస్కర్

విధాత, వరంగల్: హనుమకొండ జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువజనోత్సవాలు-2023 ప్రారంభమయ్యాయి. జె.ఎన్ స్టేడియంలో బుధవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన‌ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ యువజనోత్సవాల వేదిక ద్వారా మీలోని ప్రతిభకు పదును పెట్టి ఉన్నత స్థాయిలో రాణించాలని ఆయన కోరారు. పట్టుదల, క్రమశిక్షణ, అకుంఠిత దీక్షతో యువలోకం […]

  • Publish Date - January 4, 2023 / 12:33 PM IST

విధాత, వరంగల్: హనుమకొండ జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువజనోత్సవాలు-2023 ప్రారంభమయ్యాయి. జె.ఎన్ స్టేడియంలో బుధవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన‌ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ యువజనోత్సవాల వేదిక ద్వారా మీలోని ప్రతిభకు పదును పెట్టి ఉన్నత స్థాయిలో రాణించాలని ఆయన కోరారు. పట్టుదల, క్రమశిక్షణ, అకుంఠిత దీక్షతో యువలోకం విజయతీరాలను చేరుకోవాలన్నారు.

ఓడిపోతే ఓడిన చోటనే గెలుపు సూత్రాలను నేర్చుకుని ముందుకు సాగాల‌ని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, జిల్లా యువజన&క్రీడల అధికారి గుగులోత్ అశోక్ కుమార్, ఇందిర, సారంగపాని, కందుల సృజన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.