Site icon vidhaatha

పహల్గామ్ క్షతగాత్రులకు ఉచిత చికిత్స: ముకేశ్ అంబానీ

విధాత: పహల్గామ్ ఉగ్రదాడిలో గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఉగ్రవాదం అనేది మానవత్వానికి శత్రువు అని అంబానీ తన ప్రకటనలో స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో గాయపడిన వారికి ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ సర్ హెచ్ఎన్ హాస్పిటల్‌లో ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం, ప్రధాని మోదీ తీసుకునే చర్యలకు సంపూర్ణ మద్దతుగా నిలుస్తామన్నారు.

Exit mobile version