Heartwarming Friendship : దోస్త్ తోడుగా ఎంఆర్ఐ స్కాన్ మిషన్ లోకి..వైరల్ ఘటన !

ఎంఆర్ఐ స్కాన్‌కు భయపడిన బాలుడికి తోడుగా మిషన్‌లోకి వెళ్లిన స్నేహితుడు సోషల్ మీడియాలో వైరల్. నిజమైన స్నేహం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

MRI Scan

విధాత : ఎంఆర్ఐ స్కానింగ్ అంటే పిల్లలే కాదు.. పెద్దలు కూడా భయపడటం చూస్తుంటాం. ఆరోగ్య పరీక్షలలో భాగంగా ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ లోకి మనిషిని పంపించినప్పుడు స్కాన్ లో భాగంగా వచ్చే శబ్ధాలకు చాల మంది భయపడుతుంటారు. ఓ బాలుడు కూడా ఇదే తరహాలో ఎంఆర్ఐ స్కానింగ్ కు బెదిరిపోయాడు. తల్లిదండ్రులు, వైద్యులు ఎంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా.. అతను వినిపించుకోలేదు.

అదే సమయంలో నీతో నేను ఉంటానురా…ఏమి కాదు అన్న ఓ మాట ఆ పిల్లాడికి కొండంత ధైర్యాన్ని అందించింది. ఆ మాట…ఆ ధైర్యం చెప్పింది అతని స్నేహితుడు. నేను నీకు తోడుగా ఎంఆర్ఐ మెషిన్ లోకి వస్తాను అని చెప్పడంతో ఆ పిల్లాడు సరేనంటూ ఎంఆర్ఐ స్కానింగ్ కు ఒప్పుకున్నాడు.  చెప్పిన మాట మేరకు ఆ పిల్లాడిని పట్టుకుని అతని స్నేహితుడు ఎంఆర్ఐ  మెషిన్ లోపలకు వెళ్ళేదాక అండగా నిలిచాడు. ఆ స్నేహితుడి స్పర్శతో అతనికి కొండంత ధైర్యంతో ఎంఆర్ఐ స్కాన్ చేసేసుకున్నాడు. కష్టంలో నేను ఉన్నా అంటూ తన మిత్రునికి అండగా వచ్చిన ఆ బాలుడి స్నేహితుడి ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మిత్రులంటే ఏదో నిత్యం ఆడుకోవడానికో లేక సినిమాలకు, షికార్లకో తిరగడానికో పరిమితమైపోతున్న నేటి రోజుల్లో.. పసిప్రాయంలోనే కష్టకాలంలో అండగా నిలబడే అత్యున్నత స్నేహితుడిగా నిలబడిన ఆ పిల్లాడి స్నేహితుడిని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. స్నేహితుడంటే ఇలా ఉండాలని.. ఇలాంటి అరుదైన స్నేహం…ఇలాంటి స్నేహితులు ఉన్నవాళ్ళు ఎవరైన సరే గొప్పవాళ్ళు అదృష్టవంతులు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Army Dog Tyson | మొదటి బుల్లెట్​ తనకే.. అయినా మోస్ట్​వాంటెడ్​ను పట్టించేంతవరకు తగ్గలేదు : శునక ‘సైనికుడు’ టైసన్ వీరగాథ
Tirumala Snake Bite| తిరుమల క్యూలైన్ లో భక్తురాలికి పాముకాటు !

Latest News