Low Salary | జీతం తక్కువగా ఉందంటే అది మీ తప్పే.. ఈ పని చేస్తే తప్పక పెరుగుతుంది..!

Low Salary | చాలామంది తాము చేస్తున్న ఉద్యోగంలో వేతనం తక్కువగా ఉందని బాధపడుతుంటారు. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తుంటారు. పిల్లల చదువులు, వైద్య ఖర్చులకు డబ్బులు జీతం చాలక అప్పులు చేస్తారు. వడ్డీల మీద వడ్డీలు కడుతూ చివరికి అప్పుల ఊబిలో కూరుకుపోతుంటారు. అయితే 'ఒక మనిషి జీతం తక్కువగా ఉందంటే అది కచ్చితంగా అతని తప్పే' అని డెహ్రాడూన్‌కు చెందిన ఐటీ ఉద్యోగి అక్షయ్‌ సైనీ చెబుతున్నారు.

  • Publish Date - May 4, 2024 / 10:45 AM IST

Low Salary : చాలామంది తాము చేస్తున్న ఉద్యోగంలో వేతనం తక్కువగా ఉందని బాధపడుతుంటారు. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తుంటారు. పిల్లల చదువులు, వైద్య ఖర్చులకు డబ్బులు జీతం చాలక అప్పులు చేస్తారు. వడ్డీల మీద వడ్డీలు కడుతూ చివరికి అప్పుల ఊబిలో కూరుకుపోతుంటారు. అయితే ‘ఒక మనిషి జీతం తక్కువగా ఉందంటే అది కచ్చితంగా అతని తప్పే’ అని డెహ్రాడూన్‌కు చెందిన ఐటీ ఉద్యోగి అక్షయ్‌ సైనీ చెబుతున్నారు. జీతం చాలకపోయినా ఒకే కంపెనీకి కట్టుబానిసలా పనిచేస్తే ఎందుకు పెంచుతారని ఆయన ప్రశ్నిస్తున్నారు. మనలోని నైపుణ్యానికి తగిన వేతనం రావాలంటే మనమే తరచూ సంస్థలు మారి ఆ స్థాయికి చేరుకోవాలని సూచిస్తున్నారు.

ఉద్యోగులకు అప్రైజల్‌ సీజన్‌పై అక్షయ్‌ సైనీ తన అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అదే సమయంలో కార్పొరేట్‌ కంపెనీల గురించి పచ్చి నిజాలను వెల్లడించారు. ప్రస్తుతం అక్షయ్‌ సైనీ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అక్షయ్‌ సైనీ ఏం చెప్పారంటే ఎక్కువ జీతం కావాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయమన్నారు.

భారత్‌లో అత్యధిక కంపెనీల్లో జరిగే ఇంటర్నల్‌ అప్రైజల్స్‌ను ఆయన ఒక జోక్‌గా అభివర్ణించారు. అంతేకాదు సగటు కంటే ఎక్కువ మంది ఇంజినీర్లు డబుల్‌ డిజిట్‌ శాలరీ హైక్‌ను పొందలేదని తెలిపారు. మీ వేతనం తక్కువగా ఉన్నట్లయితే అతిగా ఆలోచించవద్దని, వెంటనే ఉద్యోగం మారాలని తన పోస్టులో సూచించారు. సంస్థకు కట్టుబడి ఉంటే జీతాలు పెరగవని చెప్పారు.

మీరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా తక్కువ జీతంతో కెరీర్‌ను ప్రారంభించి ఉంటే అధిక జీతం కోసం ఉద్యోగాలు మారాల్సిందేనని అక్షయ్ సైని అన్నారు. అలా ఉద్యోగాలు మారిన వాళ్లకే వేతనాలు పెరుగుతున్నాయని తెలిపారు. కాబట్టి మీరు తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఇరుక్కుపోయి ఉంటే.. సాలరీ హైక్‌, డిజిగ్నేషన్‌ కోసం ప్రయత్నించి విఫలమైతే ఉద్యోగం మారడమే మంచిదని సూచిస్తున్నారు.

కాగా, అక్షయ్‌ సైనీ అభిప్రాయాలకు నెటిజన్‌లు సైతం మద్దతు తెలుపుతున్నారు. ఉద్యోగం చేస్తూ ఎక్కువ జీతం పొందాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయమని, ఎక్కువ జీతం పొందేందుకు తాము కూడా సంస్థలు మారినట్లు పలువురు గుర్తుచేస్తున్నారు.

Latest News