Dharani Adalat: రాష్ట్ర వ్యాప్తంగా ‘ధరణి’ అదాలత్‌లు: కాంగ్రెస్ 

Dharani Adalats across the State రాష్ట్రంలో 60 లక్షలుంటే 20 లక్షల ఖాతాల్లో సమస్యలున్నాయి తాము అధికారంలోకి రాగానే సమగ్ర భూ సర్వే భూమి సమస్యల పరిష్కారానికి పంచసూత్రాలు కౌలు రైతులకు భరోసా కల్పిస్తాం తెలంగాణలో పొత్తులు ఉండవు మీడియా సమావేశంలో స్పష్టం చేసిన కాంగ్రెస్  విధాత: భూమి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ధరణి అదాలత్‌ (Dharani Adalat)ను నిర్వహిస్తామని కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) తెలిపింది. శుక్రవారం […]

  • Publish Date - March 10, 2023 / 03:58 PM IST

Dharani Adalats across the State

  • రాష్ట్రంలో 60 లక్షలుంటే 20 లక్షల ఖాతాల్లో సమస్యలున్నాయి
  • తాము అధికారంలోకి రాగానే సమగ్ర భూ సర్వే
  • భూమి సమస్యల పరిష్కారానికి పంచసూత్రాలు
  • కౌలు రైతులకు భరోసా కల్పిస్తాం
  • తెలంగాణలో పొత్తులు ఉండవు
  • మీడియా సమావేశంలో స్పష్టం చేసిన కాంగ్రెస్

విధాత: భూమి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ధరణి అదాలత్‌ (Dharani Adalat)ను నిర్వహిస్తామని కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) తెలిపింది. శుక్రవారం గాంధీ భవన్‌ (Gandhi Bhavan)లో ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యదర్శి, మీడియా కమ్యూనికేషన్ కమిటీ ఇంచార్జ్ జైరాం రమేష్ (Jai RamRamesh), ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే (Manik Raotakre), సీఎల్పీ (CLP) నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఇతర పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జైరాం రమేశ్‌ మాట్లాడుతూ తెలంగాణలో భూమి సమస్యలు చాలా ఉన్నాయని, వాటి పరిష్కారానికి పంచ సూత్రాలను కాంగ్రెస్ పార్టీ సూచిస్తుందన్నారు. 119 నియోజక వర్గాలలో గ్రామాల్లో ధరణి అదాలత్ కార్యక్రమాలు చేపట్టి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ధరణి వల్ల భూ సమస్యలు చాలా ఏర్పడ్డాయని, రైతులు చాలా గందరగోళంలో ఉన్నారన్నారు.

రాష్ట్రంలో 60 లక్షల మంది పేర్లు ఉంటే దాదాపు 20 లక్షల ఖాతాల్లో సమస్యలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో సంపూర్ణ సమగ్ర భూ సర్వే జరుపుతామని ప్రకటించారు. ధరణి పోర్టల్ ఉద్దేశం ఒకరి ఫోటో ఒకరికి పెట్టడం కాదు.. ఎవరి భూములకు వారి హక్కులు కల్పించాలన్నారు.

రాష్ట్రంలో భూములకు సంబంధించి 125 చట్టాలు.. 30 వేల జీఓలు ఉన్నాయి.. ఒకే చట్టం తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన భూ సేకరణ చట్టాన్ని రూపొందించిందని, 2013 లో తెచ్చిన ఈ చట్టం ప్రకారం భూ యజమాని అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితిలో సేకరించకూడదనే ఈ చట్టం తీసుకొచ్చామన్నారు. బలవంతపు భూసేకరణ పూర్తిగా నిషేధించడమే కాకుండా చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ లో 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని తెలిపారు.

బీఆర్‌ఎస్‌పై గట్టి పోరాటం చేస్తాం

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పొత్తులు ఉండవని జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు పెట్టుకోదన్నారు. అయితే మిగతా పార్టీలతో పొత్తు విషయాలను పరిశీలిస్తామని తెలిపారు. వివిధ రాష్ట్రాలలో వివిధ పార్టీలతో పాటు వామపక్షాలతోనూ పొత్తు ఉందన్నారు. తమ పార్టీ బీఆర్‌ఎస్‌పై గట్టి పోరాటం చేస్తుందని తెలిపారు.

ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం రాజస్థాన్ మోడల్ కోసం బృందాన్ని పంపుతామని ప్రకటించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ పెన్షన్ను అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ అని ఇక్కడ అభిప్రాయ భేదాలు ఉంటాయని అన్నారు.

కవిత ధర్నా హాస్యా స్పదం

ఎమ్మెల్సీ కవిత మహిళా బిల్లు విషయంలో ఇప్పుడు ధర్నా చేస్తుందని జైరామ్‌ రమేశ్‌ అన్నారు. 2010 మార్చిలోనే కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెట్టిందన్నారు. 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు కవిత ఈ విషయంలో పోరాటం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ధరణి అదాలత్‌లు

తెలంగాణలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం రైతులకు సరైన న్యాయం చేయడం లేదని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మానిక్‌రావు ఠాక్రే అన్నారు. తెలంగాణలో నేడు అతి పెద్ద సమస్య భూమి సమస్యనే అని అన్నారు. ఈ భూమి సమస్య ధరణి వల్ల మరింత చిక్కుల్లో పడిందని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండేందుకు పోరాటం చేస్తుందన్నారు. రైతుల సమస్యలకు పరిష్కారం చూపేందుకు ‘ధరణి అదాలత్’’ లు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక చేసిందని తెలిపారు. సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉండి పని చేస్తారన్నారు.

కాంగ్రెస్‌పై ప్రజల్లో విశ్వాసం

కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. తాము ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ల సమస్యలను పరిష్కారం చేస్తామని తెలిపారు. ధరణి పోర్టల్‌లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తామని భట్టి అన్నారు. సమావేశంలో ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి, మీడియా కమిటీ ఛైర్మన్ పవన్ ఖేరా, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావిద్, వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ సోషల్ మీడియా కమిటీ ఛైర్మన్ సుప్రియ, టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ రెడ్డి, మాజీ మంత్రి పుష్పలీల తదితరులు పాల్గొన్నారు.

Latest News