సినిమా అనకొండ కాదు..నిజం పామునే!

అమెజాన్‌లో 30 అడుగుల భారీ ఆకుపచ్చ అనకొండ కనిపించింది. నీటిలో దూసుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విధాత : అనకొండ సినిమాల్లో చూపించే భారీ అనకొండలు చేసే విధ్వంసం చూసినోళ్లు..భూమిపై నిజంగా అలాంటి భారీ పాములు ఉంటే మనుషుల సంగతి అంతే సంగతులు అనుకుంటారు. సినిమాల్లో చూపించినంతగా కాకపోయిన అమెజాన్ అడవులు..నదులతో పాటు పలు దేశాల్లో భారీ అనకొండలు భూమిపై ఉన్న విషయాలు అడపదడపా వెలుగు చూస్తున్నాయి. తాజాగా 30అడుగులకు పైగా ఉన్న ఓ భారీ అనకొండ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అెజాన్ దక్షిణ అమెరికాలోని పచ్చని చిత్తడి నేలలు..నదులను అవాసంగా చేసుకుని భారీ అనకొండలు జీవిస్తున్నాయి. అలాంటి ఓ భారీ అనకొండ వీడియో చూస్తే సినిమాల్లోని అనకొండలు గుర్తుకు రాక తప్పదు. 30అడుగులకు(9-10మీటర్లు)పైగా పొడవు..550పౌండ్ల బరువు ఉన్న ఆలివ్ ఆకుపచ్చ చర్మంతో ఉన్న భారీ అనకొండ నీటిలో ప్రయాణిస్తున్న దృశ్యం వామ్మో అనిపించకమానదు. ఈ ఆకుపచ్చ అనకొండ (Eunectes murinus) భూమిపై అత్యంత బరువైన పాముగా, సరీసృపాల ప్రపంచంలో నిజమైన హెవీవెయిట్ ఛాంపియన్‌గా కొనసాగుతుండటం విశేషం. ఈ జాతి అనకొండలలో ఆడ అనకొండలు మగ అనకొండల కంటే పొడవుగా ఉంటాయి. యునెక్టెస్ మురినస్ గా పిలవబడే ఈ అనకొండ మనుషులను, జంతువులను చుట్టేసి అమాంతంగా మింగేయగలదు.

ఆహారం వేటలో బలంతో పాటు తెలివి కూడా ప్రదర్శించే నైపుణ్యం ఉండటం దీని ప్రత్యేకత. నదిలో పడవలో వెలుతున్న ఓ పర్యాటక బృందం కంటపడిన ఈ ఆకుపచ్చ భారీ అనకొండను వారు వీడియో తీయగా అది కాస్తా వైరల్ గా మారింది. ఆకుపచ్చ అనకొండలు దక్షిణ అమెరికాలోని ఉత్తర ప్రాంతాలలో, కొలంబియాలోని ఒరినోకో బేసిన్, బ్రెజిల్‌లోని అమెజాన్ నదీ బేసిన్, వెనిజులాలోని వరదలున్న లానోస్ గడ్డి భూములలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఈక్వెడార్, పెరూ, బొలీవియా, గయానా, పరాగ్వే, ఫ్రెంచ్ గయానా , ట్రినిడాడ్‌లో కూడా కనిపిస్తాయి. ఆకుపచ్చ భారీ అనకొండలు ఒకేసారి కనీసంగా 20నుంచి గరిష్టంగా 80వరకు సంతానోత్పత్తి చేయడం విశేషం.

 

Latest News