విధాత : తమ ఆవాసాలు జనావాసాల కోసం విధ్వంసం చేయబడుతున్న క్రమంలో విష సర్పాలు, వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం తరుచూ చూస్తుంటాం. ఇక పాములైతే తరచు బైక్ లు, కార్లలో దూరిన ఘటనలు అడపదడపా వెలుగు చూస్తున్నాయి. తాజాగా విషపూరిత నాగుపాము ఓ బైక్ లో దూరిన ఘటన బాసరలో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఆ బైక్ యజామాని దానిని ముందుగానే గుర్తించడంతో నాగుపాము కాటు నుంచి అతని లక్కీగా బయటపడ్డట్లయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల వర్షాలు.. వరదలతో తన ఆవాసం కోల్పోయిందో ఏమోగాని ఓ నాగుపాము బైక్ ను ఆశ్రయించింది. వెనకు టైర్ కు, చైన్ బాక్స్ కు మధ్యలో దూరిపోయింది. అయితే బైక్ యజమాని బైక్ తీసుకునేందుకు వెళ్లేసరికి..బుస బుసల శబ్ధం వినిపించడంతో పరిశీలించి చూడగా..బైక్ వెనుక టైర్ భాగంలో కదులుతున్న నాగుపాము కనిపించింది. వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించగా..అతను వచ్చి ఆ నాగు పామును చాకచక్యంగా బంధించి ఓ డబ్బాలో వేసి అటవీ ప్రాంతానికి తరలించాడు.