Site icon vidhaatha

Kokila-33 | ‘కోకిల – 33’తో రైతుల ఆదాయం రెట్టింపు.. ఎక‌రాకు 30 క్వింటాళ్ల‌పైనే దిగుబ‌డి

Kokila-33 | ఇండియా( India )లోని అత్యంత ముఖ్య‌మైన పంట‌ల‌లో వ‌రి( Paddy ) ఒక‌టి. ఈ వ‌రి పంట ల‌క్ష‌లాది మంది రైతుల‌కు( Farmers ) జీవ‌నోపాధిగా నిలుస్తుంది. వ‌రి ఉత్ప‌త్తి( Paddy Produce )లో భార‌త‌దేశం అగ్ర‌గామిగా ఉన్న‌ప్ప‌టికీ.. రైతులు ఇప్ప‌టికీ స‌రైన దిగుబ‌డి పొంద‌లేక‌పోతున్నారు. రైతులు త‌మ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోలేక‌పోతున్నారు. ఎందుకంటే తెగుళ్ల బెడ‌ద‌, వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా గ‌ణ‌నీయ‌మైన దిగుబ‌డిని సాధించ‌లేక‌పోతున్నారు. అన్న‌దాత‌లు అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూ తీవ్ర న‌ష్టాల‌కు గుర‌వుతున్నారు. దీనికి అంత‌టికి కార‌ణం.. స‌రైన విత్త‌నాల ఎంపిక లేక‌పోవ‌డం. సాగులో విత్త‌నాల ఎంపిక కూడా చాలా కీల‌క‌మ‌నేది అన్న‌దాత‌లు గ్ర‌హించాలి.

వ‌రి సాగు( Paddy Crop ) చేసే రైతులను దృష్టిలో ఉంచుకుని, అన్న‌దాత‌ల ఆదాయాన్ని రెట్టింపు చేయాల‌న్న ఉద్దేశంతో.. శ‌క్తి వ‌ర్ధ‌క్ హైబ్రిడ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కొత్త వ‌రి వంగ‌డాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కోకిల -33( Kokila-33 ) వంగ‌డంతో.. రైతులు రెట్టింపు ఆదాయాన్ని పొందొచ్చ‌ని ఆ సంస్థ పేర్కొంది. ఈ వంగ‌డం వ్యాధి నిరోధ‌క శ‌క్తిని క‌లిగి ఉంది. అంతేకాకుండా అధిక దిగుబ‌డి సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉంది. కోకిల -33 ర‌కం బాస్మ‌తి బియ్యం మాదిరి ఉండి.. సుగంధ ద్ర‌వ్యాల వాస‌న‌ను వెద‌జ‌ల్లుతుంది. ధాన్యం కూడా చాలా స‌న్నగా ఉంటుంది.

కోకిల-33 అంటే ఏమిటి..? (What is Kokila-33 )

కోకిల -33 అనేది వ‌రి వంగ‌డం. ఖ‌రీఫ్ సీజ‌న్‌కు అనుకూల‌మైన పంట ఇది. నాట్లు వేసిన త‌ర్వాత ప‌రిప‌క్వ‌త ద‌శ‌కు వ‌చ్చేస‌రికి దాదాపు 105 రోజుల నుంచి 110 రోజులు ప‌డుతుంది. 88వ రోజు నాటికి 50 శాతం మేర పంట ఎదుగుతుంది. దీన్ని కాండం నిటారుగా ఉండి.. కంకి వంగిపోకుండా నిరోధిస్తుంది. దీంతో బ‌ల‌మైన ఈదురుగాలులు వీచినా, భారీ వ‌ర్షం కురిసినా పంట దెబ్బ‌తిన‌కుండా ఉంటుంది. మొత్తానికి ఈ వంగ‌డం పంట‌కు భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తుంద‌ని చెప్పొచ్చు. ఎక‌రానికి 20 నుంచి 25 క్వింటాళ్ల వ‌ర‌కు దిగుబ‌డి పొందొచ్చు. కోకిల్ -33 ర‌కాన్ని స‌రైన ప‌ద్ధతుల్లో పండిస్తే ఎక‌రానికి 30 క్వింటాళ్ల‌పైన కూడా దిగుబ‌డి పొందే అవ‌కాశం ఉంటుంది.

విత్త‌నాల‌ను ఎప్పుడు నాటాలి..? ( When and How to Sow )

కోకిల -33 విత్త‌నాల‌ను మండె పెట్టేందుకు మే 15 నుంచి జూన్ 30 వ‌ర‌కు అనువైన స‌మ‌యం. మండె మొలకెత్తిన త‌ర్వాత‌ 20 నుంచి 25 రోజుల్లోపు వ‌రి నారు పోయాలి. ఎక‌రానికి 8 నుంచి 10 కిలోగ్రాముల విత్త‌నాల‌ను నాటొచ్చు. 25 చ‌ద‌ర‌పు మీట‌ర్ల‌కు ఒక కిలో విత్త‌నాలు నాటొచ్చు. ఒక బెడ్‌కు 500 గ్రాముల యూరియా, 150 గ్రాముల డీఏపీ వాడాలి. 20 నుంచి 25 రోజుల త‌ర్వాత మొల‌క‌ని పొలంలో నాటొచ్చు.

అధిక దిగుబ‌డి కోసం..

అధిక దిగుబ‌డి కోసం.. ఒక హెక్టార్‌కు ఈ ఎరువుల‌ను వినియోగించొచ్చు. 115 కిలోల యూరియా, 60 కిలోల డీఏపీ, 25 కిలోల పోటాష్, 10 కిలోల జింక్ స‌ల్ఫేట్ వాడాలి.

కలుపు, తెగుళ్ల నిర్వహణ( Weed and Pest Management )

స‌కాలంలో స‌రైన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే కలుపు మొక్కలు దిగుబడిని తగ్గిస్తాయి. నాట్లు వేసిన 3 రోజుల తర్వాత, కలుపు మొక్కలను సమర్థవంతంగా నియంత్రించడానికి బ్యూటాక్లోర్ 50 EC (ఎకరానికి 1.2 లీటర్లు) లేదా ప్రీటిలాక్లోర్ 50 EC (ఎకరానికి 800 మి.లీ) పిచికారీ చేయాలి. ఆలస్యంగా పెరిగే కలుపు మొక్కలను నియంత్రించడానికి నీటిలో కరిగించిన బిస్పైరిబాక్ సోడియం (నోమిని గోల్డ్) ఎకరానికి 100 మి.లీ. పిచికారీ చేయాలి. తెగుళ్ల నివార‌ణ‌కు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G (ఎకరానికి 15 కిలోలు) లేదా ఫిప్రోనిల్ 0.3G (ఎకరానికి 20 కిలోలు) పిచికారీ చేయాలి.

Exit mobile version