Site icon vidhaatha

Adhi Dha Surprisu: నెట్టింట మంట పెడుతున్న అదిదా స‌ర్‌ఫ్రైజు..

Adhi Dha Surprisu:

విధాత‌: నితిన్ (Nithiin), శ్రీలీల (Sree leela) జంటగా వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో రూపొందిన చిత్రం రాబిన్ హుడ్ (Robinhood). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లో విడుదలకు సిద్ధమైంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్ప‌టికే సినిమా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసిన మేక‌ర్స్ తాజాగా అదిదా స‌ర్ ఫ్రైజ్ (Adhi Dha Surprisu) అంటూ సాగే ప్ర‌త్యేక పాట లిరిక‌ల్ వీడియోను రిలీజ్ చేశారు.

చంద్ర‌బోస్‌ (Chandrabose) సాహిత్యం అందించిన ఈ పాట‌ను నీతి మోహ‌న్ (Neeti Mohan), అనురాగ్ కుల‌క‌ర్ణి (Anurag Kulkarni ) ఆల‌పించ‌గా జీవీ ప్ర‌కాశ్‌ కుమార్ (G.V. Prakash Kumar) సంగీతం అందించాడు. ఈ పాట‌ను అకాశ్ పూరి రొమాంటిక్‌, బ్రో సినిమాలో సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా చేసిన కేతిక శ‌ర్మ (Ketika Sharma)పై చిత్రీక‌రించ‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్ (Shekar Master) నృత్యం స‌మ‌కూర్చాడు. అయితే ఈ పాట ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుండ‌గా ముఖ్యంగా స్టెప్పుల గురించి చ‌ర్చ బాగా న‌డుస్తోంది.

ఆ మ‌మ‌ధ్య డాకూ మ‌హారాజ్‌లో హీరోయిన్‌ను వెన‌కాల కొట్టే స్టెప్పుల‌, మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమాలో హీరోయిన్ డ్రెస్ పాకెట్ల‌లో హీరో చేతులు పెట్టించే స‌న్నివేశాలపై తీవ్రం విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వాటిన‌న్నింటిని మించి అనేలా ప్ర‌స్తుత స‌న్నివేశం ఉండ‌డంతో జాతీయ స్థాయిలో పెద్ద ర‌చ్చే జ‌రుగుతోంది. చూడాలి ఈ వివాదం ఎంవ‌త దూరం వెళుతుందో..

 

Exit mobile version