Janhvi Kapoor First Look in Peddi | పెద్ది: అచ్చియమ్మ లుక్ అదిరిందబ్బా! జాన్వీ మాస్ వైరల్​.!

రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' నుంచి హీరోయిన్ జాన్వీకపూర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. జాన్వీ ఈ చిత్రంలో అచ్చియ‌మ్మా అనే క్రికెట్ కామెంటేట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Peddi Movie: Janhvi Kapoor’s Fiery Look as Achiyyamma Sets the Internet Ablaze

Screenshot

(విధాత వినోదం డెస్క్​)

హైదరాబాద్​:  మళ్ళీ రామ్ చరణ్ సినిమా చుట్టూ హైప్ హద్దులు దాటుతోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ నుంచి తాజాగా హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్​ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఒక్క మాటే చెబుతున్నారు — అచ్చియమ్మ లుక్ అదిరిపోయిందబ్బా!”

పల్లెటూరిపిల్లగా జాన్వీ మాస్​ గ్రేస్​

తెలుగులో దేవర సినిమాతో మెప్పించిన జాన్వీ కపూర్, ఇప్పుడు ఈ సినిమాలో మరింత ధైర్యంగా, మరింత దూకుడుతో కనిపించబోతోంది. అచ్చియమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో ఆమె లుక్ ఇప్పుడు వైరల్‌. నీలి చీరలో జీప్‌పై నిలబడి చేతులు ఎత్తి నమస్కరిస్తున్న పోస్టర్‌లో అచ్చియమ్మ ఆత్మవిశ్వాసం వేరే లెవెల్లో ఉంది.
మరో పోస్టర్‌లో మైక్ ముందు ధైర్యంగా నిలబడి ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ఈ లుక్ చూసి, ఫ్యాన్స్ అమ్మాయిది రామచరణ్‌తో ఇక మాస్​జాతరే అని కామెంట్లు చేస్తున్నారు. మేకర్స్ ఈ పాత్రను “ఫైర్‌బ్రాండ్ లవ్‌ విత్ ఆటిట్యూడ్” అని డిఫైన్ చేశారు. అంటే, అచ్చియమ్మ ప్రేమించే అమ్మాయి మాత్రమే కాదు — ఎదిరించడానికీ వెనుకాడని అమ్మాయి. రామ్ చరణ్ జీవితంలో అచ్చియమ్మ ఎలాంటి మార్పు తీసుకువస్తుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది.

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఈ సినిమా చరణ్ కెరీర్‌లో కొత్త మలుపు అని చెప్పొచ్చు. దర్శకుడు ఉప్పెనలో చూపించిన భావోద్వేగం, పల్లెటూరి పట్టుదలలు పెద్దిలో మరింత గాఢతకు చేరుకున్నాయని తెలుస్తోంది.. చరణ్ పెద్ది పాత్ర కోసం తన శరీరాన్ని పాత్రకు తగ్గట్టుగా మలుచుకున్నారు. “చరణ్ అన్న పడుతున్నకష్టం ఫలితంగా సినిమా అదిరిపోతుంది!” అని జానీ మాస్టర్‌ ధీమా వ్యక్తం చేసారు. సంగీతంలో మాత్రం పెద్ది కి సూపర్‌సౌండ్ గ్యారెంటీ. ఏఆర్ రెహ్మాన్ స్వరాలు, రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ – ఇవన్నీ సినిమా స్టాండర్డ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నాయి. వినాయక చవితి రోజున మైసూర్‌లో చిత్రీకరించిన భారీ పాటలో వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొన్నారు. ఇది రామ్ చరణ్ కెరీర్‌లోనే లార్జెస్ట్ సాంగ్ అని చెబుతున్నారు. పెద్ది’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం శ్రీలంక‌లో కీల‌క‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈనెల 8న తొలిగీతం?

అలాగే నవంబర్​ 8న రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరగబోయే ఏఆర్​ రెహమాన్​ సంగీత విభావరిలోనే ఈ చిత్ర తొలిగీతాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్శకుడు బుచ్చిబాబు సామాజిక మాధ్యమాల వేదికగా సంకేతాలు అందించారు. అభిమానులు రహమాన్​ సంగీతం ఎలా ఉండబోతోందో అన్న టెన్షన్​తో చచ్చిపోతున్నారు. అదీకాక, రెహమాన్​ కూడా ఈ కథ తనకు బాగా నచ్చింది కాబట్టే సంగీతం ఇవ్వడానికి ఒప్పుకున్నానని ప్రకటించాడు కూడా.

కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు లాంటి భారీ తారాగణం ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నారు. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్, ప్రేమ, త్యాగం, పోరాటం కలిపిన ఈ కథ ఇప్పుడు పాన్ ఇండియా ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

‘పెద్ది’ సినిమా మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదే రోజు రామ్ చరణ్ జన్మదినం కావడంతో, చరణ్ ఫ్యాన్స్‌కు ఇది ఒక సూపర్ గిఫ్ట్‌గా మారనుంది.