SIT Issues Notice To KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారి చేసింది. నందినగర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అందించారు. రేపు కేసీఆర్ కోరుకున్న చోటనే ఆయనను విచారిస్తామని సిట్ నోటీసులో పేర్కొనడం గమనార్హం.

KCR Phone Tapping Case

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ సాగిస్తున్న సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను విచారించేందుకు సిద్దమైంది. ఇందుకోసం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. కేసీఆర్ నివాసం నందినగర్ కు వెళ్లి  సిట్ అధికారులు  అక్కడే నోటీసులు అందించారు. నోటీసులో రేపు శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులో స్పష్టం చేశారు. అయితే వయసు రిత్యా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రానవసరం లేదని, మీరు చెప్పిన చోటకు సిట్ బృదం వచ్చి విచారిస్తుందని నోటీసులో పేర్కొనడం విశేషం. దీంతో కేసీఆర్ రేపు విచారణకు ఎక్కడ అందుబాటులో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదే కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నేతలు మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, మాజీ ఎంపీసంతోష్‌రావులను సిట్‌ ఇటీవల విచారించిన విషయం తెలిసిందే.కేసీఆర్ తో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు నేరుగా సంబంధాలు, రాధాకిషన్ రావు విచారణ సందర్భంగా పెద్దాయన ఆదేశాలతోనే ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా పేర్కోనడం వంటి అంశాలపై కేసీఆర్ ను సిట్ ప్రశ్నించే అవకాశం ఉంది.రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో పెద్దాయన అంటూ ప్రస్తావన ఉండటం గమనార్హం.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా ప్రతిపక్ష నాయకులు, జడ్జీలు, జర్నలిస్టులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు వంటి ప్రముఖుల ఫోన్లను వేల సంఖ్యలో ట్యాపింగ్ చేసినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేసు నమోదైంది. అప్పటి ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్ రావు, మాజీ డీసీసీ రాధాకిషన్ రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతయ్య, మాజీ డీఎస్పీ ప్రణిత్ రావు, మీడియా ప్రతినిధి శ్రవణ్ రావులను కేసులో ప్రధాన నిందితులుగా చేర్చి ఇప్పటికే వారిని సిట్ విచారించింది. వారితో పాటు బాధితులుగా ఉన్న పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులను, నాయకులను సిట్ ప్రశ్నించింది. వారి నుంచి సేకరించిన ఆధారాలు, వాంగ్మూలాల ఆధారంగా సిట్ విచారణ ముందుకు దూకిస్తుంది.

ఇవి కూడా చదవండి :

Yadagirigutta Temple : యాదగిరిగుట్ట దేవాలయంలో బంగారం, వెండి డాలర్ల మాయం !
SBI POs Monthly Salary : ఎస్‌బీఐ పీవో నెల జీతం రూ.1.25 లక్షలు.. సోషల్‌ మీడియాలో విపరీతంగా చర్చ

Latest News