బ్యాంకులో ఉద్యోగం (bank employee) అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉద్యోగ భద్రత, మంచి జీతం. అందుకే చాలా మంది బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని అనుకుంటుంటారు. అందుకోసం కోచింగ్‌లు తీసుకుంటూ రాత్రింపగళ్లు కష్టపడి చదువుతుంటారు. అలా జాబ్ సంపాదించి జీవితంలో ముందుకు సాగుతారు. ఇక బ్యాంకు ఉద్యోగం అంటే మంచి జీతం ఉంటుందని తెలుసు. కానీ ఓ పీవోకు నెలకు రూ. లక్ష వరకూ జీతం (SBI POs monthly salary) వస్తుందంటే నమ్ముతారా..? అవును మీరు విన్నది నిజమే. ఓ ప్రొబేషనరీ ఆఫీసర్ తన నెలవారీ జీతం గురించి ఇన్‌స్టాలో షేర్ చేసిన వివరాలు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
శ్వేత అనే యువతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)గా పనిచేస్తున్నారు. అయితే, ఆమె నెల జీతం రూ.95,000 అంట. దీంతోపాటూ లీజు రెంటల్ రూ. 18,500, ఇతర అలవెన్సులు సుమారు రూ. 11,000 వరకు వస్తాయట. ఈ లెక్కన మొత్తం అన్ని అలవెన్సులు కలుపుకుంటే ఆమె నెలకు దాదాపు రూ. 1.25 లక్షల వరకు జీతంగా అందుకుంటున్నారు. ఈ విషయాన్ని శ్వేత స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దాదాపు 2.5 సంవత్సరాల సర్వీస్‌లోనే తాను నెలకు ఈ జీతం తీసుకుంటున్నట్లు వివరించారు.
ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా నోరెళ్లబెడుతున్నారు. శ్వేత జీతం గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఇంత తక్కువ సమయంలోనే అంత జీతం ఎలా సాధ్యం..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి శ్వేత క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ రెండున్నరేళ్లలో ఐదు ఇంక్రిమెంట్లు తీసుకున్నట్లు చెప్పారు. అందులో రెండు వార్షిక ఇంక్రిమెంట్లు కాగా, మిగిలిన మూడు ఇంక్రిమెంట్లు ఆమె బ్యాంకింగ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్లు అయిన JAIIB, CAIIB పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినందుకు లభించినట్లుగా వివరించారు. దీంతో ఆమె జీతం గురించి ఎక్కడ చూసినా తెగ చర్చ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి :
Triptii Dimri | వైట్ డ్రెస్ లో క్యూట్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న స్పిరిట్ భామ త్రిప్తి
Colombia plane crash| ఘోర విమాన ప్రమాదం.. 15 మంది దుర్మరణం
