విధాత, హైదరాబాద్ : ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్ల తొలగింపు బాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. కవిత ఖమ్మం అంబేద్కర్ భవన్ నలో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి సోమవారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులు కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు.
ఉదయం 9.30 గంటల సమయంలో కవిత హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకొని వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఎంత ధైర్యం ఉంటే పేదల ఇళ్లను తొలగిస్తారంటూ కవిత ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాధితులకు అన్న పానీయాలు కూడా అందించడం లేదని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడటమంటే పేద వారి భూములను కొల్లగొట్టి పెద్దలకు పంచడమేనా రాహుల్ గాంధీజీ ? అంటూ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులకు ఇందులో ప్రమేయం ఉందని కవిత ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈ విధ్వంసంలో భాగస్వామ్యం లేకపోతే వెలుగుమట్ల బాధితులకు కూల్చిన చోటనే ప్లాట్లు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే వరకు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
CBSE Class 12 Maths Paper : సీబీఎస్ఈ 12వ తరగతి క్యూఆర్ కోడ్ లో యూ ట్యూబ్ సాంగ్ !
భారత క్రికెట్ జట్టు ఎందుకు బ్లూ కలర్ జెర్సీనే ధరిస్తుందో తెలుసా?
