Site icon vidhaatha

SBI: FY 25 ఫలితాలు ప్రకటించిన SBI జనరల్ ఇన్సూరెన్స్! 112% పెరిగిన లాభం

ముంబై, ఏప్రిల్ 23, 2025: భారతదేశంలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటైన SBI జనరల్ ఇన్సూరెన్స్, 15 సంవత్సరాల విజయవంతమైన సేవలను పూర్తి చేసుకున్న సందర్భంగా FY25 ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సంస్థ గ్రాస్ రిటన్ ప్రీమియం (GWP) రూ.14,140 కోట్లుగా నమోదై, 11.1% వృద్ధిని సాధించింది. 1/n అకౌంటింగ్ నిబంధన ప్రభావాన్ని మినహాయిస్తే, GWP 14.5% వృద్ధి చెందింది. పరిశ్రమ సగటు వృద్ధి రేటు 6.2%తో పోలిస్తే, SBI జనరల్ ఇన్సూరెన్స్ 70% వేగంగా అభివృద్ధి సాధించింది. లాభం (PAT) రూ.509 కోట్లకు చేరి, 112% అధిక వృద్ధిని నమోదు చేసింది.

ప్రైవేట్ మార్కెట్ వాటాలో 23 బేసిస్ పాయింట్ల మెరుగుదలతో, సంస్థ తన బలమైన స్థానాన్ని నిలుపుకుంది. వ్యక్తిగత యాక్సిడెంట్ (PA) విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ, ఆరోగ్య బీమా 19.2%, మోటార్ బీమా 31.2% వృద్ధిని సాధించాయి. మెరైన్ కార్గో, ఇంజినీరింగ్, ఇతర వాణిజ్య విభాగాలు కూడా గణనీయంగా దోహదపడ్డాయి. సంస్థ యొక్క సాల్వెన్సీ నిష్పత్తి 2.03గా ఉండి, నియంత్రణ అవసరమైన 1.50 కంటే ఎక్కువగా నమోదై, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రదర్శించింది.

SBI జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో నవీన్ చంద్ర ఝా మాట్లాడుతూ.. “మేము మార్కెట్ కంటే వేగంగా వృద్ధి సాధిస్తున్నాము. FY25లో మా GWP 11.1% పెరిగింది, లాభం 2.1 రెట్లు ఉన్నత స్థాయికి చేరింది. 15 ఏళ్ల విజయాన్ని జరుపుకుంటూ, భవిష్యత్తులో కూడా నమ్మకమైన, సరసమైన బీమా సేవలతో దేశవ్యాప్తంగా ఆర్థిక భద్రతను అందించడానికి కట్టుబడి ఉన్నాము” అని తెలిపారు. సీఎఫ్‌ఓ జితేంద్ర అత్రా మాట్లాడుతూ.. “FY25 ఫలితాలు మా స్థిరమైన వృద్ధి, దీర్ఘకాలిక విలువ సృష్టి పట్ల నిబద్ధతను చాటుతున్నాయి. నష్ట నిష్పత్తిలో గణనీయమైన మెరుగుదల, ఉత్పాదకత, ఖర్చు నిర్వహణ, కార్యాచరణ సామర్థ్యంపై మా దృష్టిని ప్రతిబింబిస్తుంది” అని పేర్కొన్నారు.

Exit mobile version