Nissan Gravite | కేవలం 6 లక్షలకే 7 సీటర్ కారు.. ఫ్యామిలీ ట్రిప్‌లకు వెళ్లే వారే టార్గెట్‌‌గా నిసాన్ కొత్త కారు!

Nissan Gravite | పెద్ద ఫ్యామిలీలే టార్గెట్‌గా నిసాన్ కంపెనీ కొత్త కారును తీసుకొచ్చింది. కేవలం రూ.5.6 లక్షల ప్రారంభ ధరతోనే నిసాన్ గ్రావైట్ ఎస్‌యూవీని భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది.

Nissan Gravite | భారత్‌లోని సగటు మధ్య తరగతి కుటుంబాలను టార్గెట్‌గా చేసుకుని నిసాన్ కంపెనీ కొత్త కారును లాంచ్ చేసింది. చవక ధరలో పెద్ద ఫ్యామిలీల అవసరాలను తీర్చేలా నిసాన్ గ్రావైట్ SUV కారును భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ కారు లోపలి క్యాబిన్ విస్తారంగా ఉండటంతో సులువుగా ఏడుగురు ప్రయాణించవచ్చు.. పైగా బూట్ స్పేస్ కూడా అధికంగా ఉండటంతో కంఫర్ట్‌గా ఫ్యామిలీ ట్రిప్స్ వేయవచ్చు. పైగా ఈ కారు కేవలం రూ.5.65 లక్షల ప్రారంభ ధరతోనే వస్తుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

తక్కువ ధరలో హైఎండ్ SUV ఫీల్

డిజైన్ విషయానికి వస్తే.. సాధారణ MPVలా కాకుండా యూత్‌ఫుల్‌గా కనిపించేలా నిసాన్ కంపెనీ శ్రద్ధ తీసుకుంది. ముందు భాగంలో సిగ్నేచర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంపులు, వాటితో కలిసిన ఇంటిగ్రేటెడ్ డీఆర్‌ఎల్‌లు కారుకు ప్రీమియం లుక్ తీసుకొచ్చాయి. ఆల్‌రౌండ్ ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్, క్రిస్టల్ ఎడ్జ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ ఫాగ్‌ల్యాంపులు వచ్చాయి. వీటితో పాటు గ్లోస్ బ్లాక్ గ్రిల్, అగ్రెసివ్ బంపర్లు, సిల్వర్ యాక్సెంట్‌తో ఈ SUV మరింత మోడర్న్‌గా కనిపిస్తుంది. మొత్తంగా లుక్ మాత్రం హై ఎండ్ SUV ఫీల్‌ను ఇస్తుంది.

625 లీటర్ల బూట్ స్పేస్

ఇక ఇంటీరియర్ కూడా ఈ నిసాన్ కారుకు అదనపు ఆకర్షణ అనే చెప్పాలి. మూడు వరుసల సీటింగ్‌తో పాటు రెండో వరుస సీట్లు స్లైడ్, రిక్లైన్ అవ్వడం వల్ల ప్రయాణికులకు మంచి సౌకర్యం లభిస్తుంది. సాధారణంగా 7 సీటర్ కార్లలో బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. కానీ ఈ కారులో మూడో వరుసను ఫోల్డ్ చేయడం లేదా పూర్తిగా తీసేయడం ద్వారా 625 లీటర్ల వరకు బూట్ స్పేస్‌ను పెంచుకోవచ్చు. అంటే ఫ్యామిలీ ట్రిప్‌నకు వెళ్లినప్పుడు పెద్ద మొత్తంలో లగేజీ తీసుకెళ్లడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ట్రాఫిక్‌లోనూ ఈజీ డ్రైవింగ్!

ఇంజిన్, పనితీరు విషయానికి వస్తే.. ఈ కారు 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 72 పీఎస్ పవర్, 96 ఎన్ఎం టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల సిటీలోని రోడ్ల మీద కూడా సాఫీగా ప్రయాణించవచ్చు. స్టీరింగ్ తేలికగా, కాంపాక్ట్ సైజ్‌లో ఉండటం వల్ల ట్రాఫిక్‌లో కారును సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, 5 స్పీడ్ EZ షిఫ్ట్ (AMT) కూడా లభిస్తుంది. దీంతో డ్రైవర్ తనకు నచ్చిన విధంగా ఎంపిక చేసుకోవచ్చు. సస్పెన్షన్ సెటప్ బాగా ట్యూన్ చేయడం వల్ల రోడ్లపై గుంతలు ఉన్నా కూడా కుదుపుల లేకుండా సాఫీగా ప్రయాణం చేయవచ్చు.

మైలేజీ ఎంతంటే..

మైలేజీ విషయానికి వస్తే.. మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు సుమారు 19.3 కిలోమీటర్ల వరకు, ఆటోమేటిక్ వేరియంట్ లీటర్‌కు సుమారు 19.6 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుుంది. అంతేకాదు ఈ నిసాన్ గ్రావైట్‌కు డీలర్ స్థాయిలో సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉండటం విశేషం.

ఫీచర్లు

ఇక ఫీచర్ల పరంగా చూస్తే.. ఈ కారు‌లో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉందులో ఉన్నాయి. అయితే అలాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్ వంటి ఫీచర్లు మాత్రం ఇందులో లేకపోవడం కొంచెం నిరాశను కలిగిస్తాయి.

పెద్ద ఫ్యామిలీకు బెస్ట్ చాయిస్!

ధర పరంగా చూస్తే.. నిసాన్ గ్రావైట్ రూ.5.65 లక్షల నుంచి రూ.8.93 లక్షల (ఎక్స్‌ షోరూం ధర)కు లభిస్తుంది. మొత్తం ఆరు వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది. మొత్తంగా తక్కువ బడ్జెట్‌లో వస్తున్న ఈ కారు ఫ్యామిలీ ట్రిప్‌లకు పర్‌ఫెక్ట్‌ ఛాయిస్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read More:

హోండా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్‌పై 2 లక్షల దాకా డిస్కౌంట్!

5 నిమిషాల్లోనే ఛార్జ్ అయ్యే ఈవీ కారు.. ఆటోమొబైల్ రంగంలో సంచలనం

Latest News