భారత్‌లోకి బీవైడీ ‘లెపర్డ్ 8’ హైబ్రిడ్ ఎస్‌యూవీ! ‘డిఫెండర్’కు ప్రత్యర్థి?
భారత్‌లో BYD Leopard 8 హైబ్రిడ్ SUV డిజైన్ పేటెంట్ దాఖలు. 748bhp పవర్, 1200km రేంజ్, ప్రీమియం ఫీచర్లతో లగ్జరీ ఆఫ్-రోడర్ త్వరలో లాంచ్ అయ్యే సూచనలు. నేరుగా ల్యాండ్‌రోవర్ డిఫెండర్‌ను ఢీకొనే అవకాశం
ల్యాండ్ రోవర్ డిఫెండర్ తరహా రగ్డ్ డిజైన్‌తో బీవైడీ లెపర్డ్ 8
BYD Leopard 8 PHEV Patent Filed In India – Premium Off-Road SUV Entry Soon?
🔴 748bhp పవర్‌తో హై-పర్ఫార్మెన్స్ PHEV SUV
🔴 100km ఎలక్ట్రిక్ రేంజ్ + 1200km మొత్తం రేంజ్
🔴 ట్రిపుల్ స్క్రీన్, 18 స్పీకర్ ఆడియో వంటి ప్రీమియం ఫీచర్లు
🔴 బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణంతో నిజమైన ఆఫ్-రోడ్ సామర్థ్యం
విధాత ఆటో డెస్క్ | హైదరాబాద్:
BYD Leopard 8 | భారత్ ఆటో మార్కెట్‌లో ప్రీమియం సెగ్మెంట్‌పై దృష్టి పెంచిన చైనా ఈవీ దిగ్గజం BYD మరో కీలక అడుగు వేసింది. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ అయిన బివైడీ లెపర్డ్8 కోసం దేశంలో డిజైన్ పేటెంట్ దాఖలు చేయడంతో, త్వరలో విడుదలకు బలమైన సంకేతంగా భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో “ఫాంగ్‌చెంగ్‌బావో బావో 8”, “డెంజా బీ8” పేర్లతో విక్రయాల్లో ఉన్న ఈ మోడల్, భారత ప్రీమియం ఆఫ్-రోడ్ సెగ్మెంట్‌లో కొత్త పోటీని తెచ్చే అవకాశముంది.
లియోపార్డ్ 8 ప్రధానంగా బాడీ-ఆన్-ఫ్రేమ్ ప్లాట్‌ఫాంపై నిర్మించబడిన పూర్తి స్థాయి లగ్జరీ ఆఫ్-రోడర్. పరిమాణాల పరంగా చూస్తే ఇది దాదాపు Land Rover Defender 110 స్థాయికి సమానంగా ఉంటుంది. 5,195 మి.మీ పొడవు, 1,994 మి.మీ వెడల్పు, 1,905 మి.మీ ఎత్తుతో భారీ ఆకృతిలో కనిపించే ఈ SUV, రోడ్డు మీద చూపరులను ఆకర్షించే విధంగా ఉంటుంది.
డిజైన్ : మొరటు లుక్‌తో ధృడంగా..

ముందు-వెనుక డిజైన్‌లో బాక్సీ స్టైలింగ్, టెయిల్‌గేట్‌పై స్పేర్ వీల్‌తో బీవైడీ లెపర్డ్ 8
లియోపార్డ్ 8 డిజైన్ పూర్తిగా బాక్సీ(జీపు లాంటి), మస్క్యులర్ లుక్‌తో రూపొందించబడింది. ముందు భాగంలో రెక్టాంగ్యులర్ LED హెడ్‌ల్యాంప్స్‌ను సన్నని లైట్ బార్‌తో కలిపి, ఆరు వరుసలవ గ్రిల్‌తో ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. దిగువ భాగంలో భారీ స్కిడ్ ప్లేట్లు, బ్లాక్ క్లాడింగ్‌తో ఇది ఆఫ్-రోడ్‌కు సిద్ధమై ఉన్నట్లు కనిపిస్తుంది. పైభాగంలో ఉన్న మూడు LiDAR సెన్సార్లు అధునాతన ADAS సిస్టమ్‌కు మద్దతు ఇస్తాయి.
పక్క భాగంలో బ్లాక్ పిలర్స్, భారీ వీల్ ఆర్చెస్, పెద్ద అలాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఈ SUVకి ఆధునిక లుక్ ఇస్తాయి. వెనుక భాగంలో టెయిల్‌గేట్‌పై అమర్చిన స్పేర్ వీల్, సి-షేప్ DRL టెయిల్‌ల్యాంప్స్, ఫ్లాట్ రియర్ గ్లాస్—అన్నీ కలిసి ఈ వాహనానికి ఒక అసలైన ఆఫ్-రోడర్ ఇమేజ్ ఇస్తాయి.
ఇంటీరియర్ : అధునాతన సాంకేతికతతో నిండిన అనుభవం

బీవైడీ లెపర్డ్ 8 ఇంటీరియర్‌లో ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్, అంబియెంట్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణ
లియోపార్డ్ 8 కేబిన్ పూర్తిగా ఆధునిక సాంతకేతిక సౌకర్యాలతో నిండిపోయింది. డ్యాష్‌బోర్డ్‌పై మూడు పెద్ద స్క్రీన్లు—12.3 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 17.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, 12.3 అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లే—ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఎయిర్‌క్రాఫ్ట్ స్టైల్ గేర్ సెలెక్టర్, డ్యుయల్ వైర్‌లెస్ చార్జింగ్, అంబియెంట్ లైటింగ్, 18 స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఆడంబరాల స్థాయిని మరింత పెంచుతున్నాయి.
సీటింగ్ పరంగా 5, 6, 7 సీటర్ ఆప్షన్లు ఉండగా, 6-సీటర్ వెర్షన్‌లో రెండో వరుసలో కెప్టెన్ సీట్స్ అందుబాటులో ఉంటాయి. ఫ్రాగ్రెన్స్ సిస్టమ్, ఆటో పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుతాయి.
పనితీరు : భారీ పవర్‌తో స్పోర్ట్స్ కార్ స్థాయి వేగం

టెయిల్‌గేట్‌పై స్పేర్ వీల్‌తో ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌లో లెపర్డ్ 8
లియోపార్డ్ 8లో ఉన్న ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సెట్‌అప్ దాని ప్రధాన బలం. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు డ్యుయల్ ఎలక్ట్రిక్ మోటార్లు, 36.8 kWh బ్యాటరీ కలిసి పనిచేస్తాయి. మొత్తం పవర్ సుమారు 748bhp, టార్క్ 760Nm. ఈ శక్తితో 0-100 కిమీ వేగాన్ని కేవలం 4.8 సెకన్లలో అందుకుంటుంది.
ఇది AWD సిస్టమ్‌తో పాటు e-CVT ట్రాన్స్‌మిషన్ ద్వారా నాలుగు చక్రాలకు శక్తిని పంపుతుంది. ఈ స్థాయి పనితీరుతో ఇతర సాధారణ SUVలకంటే లెపర్డ్ చాలా ముందుంది.
రేంజ్ & ఆఫ్–రోడ్ సామర్థ్యం : రెండింటిలోనూ టాప్ క్లాస్

విస్తారమైన కేబిన్, లగ్జరీ సీటింగ్‌తో పాటు ప్యానోరమిక్ సన్‌రూఫ్‌తో లెపర్డ్ 8
లియోపార్డ్ 8లో ఎలక్ట్రిక్ మోడ్‌లో 100 కిమీ వరకు ప్రయాణించవచ్చు. మొత్తం డ్రైవింగ్ రేంజ్ సుమారు 1,200 కిమీగా కంపెనీ పేర్కొంటోంది. ఇది నగర ప్రయాణాలకు EV ప్రయోజనం, దీర్ఘ ప్రయాణాలకు హైబ్రిడ్ సౌలభ్యం అందిస్తుంది.
ఆఫ్-రోడ్ సామర్థ్యం పరంగా కూడా ఇది బలమైన ప్యాకేజీ. బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణం, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్స్, మల్టిపుల్ టెర్రైన్ మోడ్‌లు, హై గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల ఇది నిజమైన అడ్వెంచర్ SUVగా నిలుస్తుంది.
భారత్ మార్కెట్‌పై ప్రభావం – కొత్త పోటీ ప్రారంభం

భారత్‌లో దాఖలైన బీవైడీ లెపర్డ్ 8 డిజైన్ పేటెంట్ చిత్రం
భారత మార్కెట్లో ప్రీమియం SUV సెగ్మెంట్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, లియోపార్డ్ 8 లాంచ్ అయితే పెద్ద మార్పు రావచ్చు. ముఖ్యంగా డిఫెండర్ వంటి లగ్జరీ ఆఫ్-రోడర్లకు ఇది ప్రత్యక్ష పోటీ ఇవ్వగలదు. అదే సమయంలో, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీకి భారత మార్కెట్లో మరింత గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది.
-
ధర మాత్రం 70 నుండి 90 లక్షల రూపాయల(ఎక్స్ షోరూమ్) వరకు ఉండొచ్చని అంచనా.
అయితే నగర వాతావరణానికి, సౌకర్యవంతమైన, లగ్జరీ ప్రయాణాలకు అంతగా బాగుండకపోవచ్చు. ఏదేమైనా ‘థార్’ నగరాల్లో కూడా పెద్ద విజయం సాధించింది కాబట్టి, వినియోగదారులు ఇష్టపడొచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram