శింగనమల నియోజకవర్గ ప్రజల ఆరోగ్యానికి శ్రీరామరక్ష
విధాత:కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో శింగనమల నియోజకవర్గ ప్రజల కోసం ఆలూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.30లక్షల వ్యయంతో కొర్రపాడులో 200 పడకల ఆసుపత్రి ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, ఆరోగ్యానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలిపారు.
అందుకు నిదర్శనమే కొర్రపాడు గ్రామంలోని సామాజిక గురుకుల పాఠశాలలో ఆలూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.30 లక్షల వ్యయంతో , 50 ఆక్సిజన్, 150 నాన్ ఆక్సిజన్ కలిపి మొత్తం 200 పడకలతో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఇంకా ఇక్కడ సెమి ఆటో అనలైజర్, సెల్ కౌంటర్, ఫ్లో మీటర్లు, ఆక్సిజన్ మాస్కులు, బ్యాక్ రెస్టులు, స్టెచర్లు, వీల్ చైర్లతో కోవిడ్ బాధితులకు వైద్య సౌకార్యాలు అందిస్తున్నట్లు తెలిపారు.వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై.. రెండేళ్లు అయిన సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే ప్రజోపయోగకర పనులు మరెన్నో చేస్తామని రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివా రెడ్డి గారు పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ శ్రీ తలారి రంగయ్య గారు, ఎమ్మెల్సీ శమంతకమణి గారు పాల్గొన్నారు..