Special Trains | సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగవాసులంతా పల్లెబాట పడుతున్నారు. ఈ క్రమంలో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. చాలా మందికి సీట్లు దొరక్క ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను తీసుకువచ్చింది. ఇప్పటికే ప్రత్యేక రైళ్లను భారీగా ప్రకటించగా.. రద్దీ కొనసాగుతున్నది. ఈ రద్దీని తగ్గించేందుకు తాజాగా మరో ఆరు రైళ్లను నడిపించనున్నట్లు వివరించింది. సికింద్రాబాద్ – తిరుపతి, తిరుపతి సికింద్రాబాద్, సికింద్రాబాద్-కాకినాడ, సికింద్రాబాద్ – నర్సాపూర్ మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఈ నెల 15న సికింద్రాబాద్-తిరుపతి (07489) ప్రత్యేక రైలు రాత్రి 8.10గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతికి చేరుతుంది. ఈ నెల 16న తిరుపతి-సికింద్రాబాద్ (07490) స్పెషల్ ట్రైన్ సాయంత్రం 4.35గంటలకు తిరుపతి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు సికింద్రాబాద్‌లో చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 17న సికింద్రాబాద్-కాకినాడ టౌన్ (07066) మధ్య రైలు నడువనున్నది. రాత్రి 7 గంటలకు బయలుదేరి తెల్లవారి 7.10 గంటలకు గమ్యస్థానంలో ఉంటుంది. 18న కాకినాడ-సికింద్రాబాద్ (07067) రైలు రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. 17న నర్సాపూర్-సికింద్రాబాద్ (07251) రైలు సాయంత్రం 6 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. 18న సికింద్రాబాద్ -నర్సాపూర్ (07252) ప్రత్యేక రైలు రాత్రి 11.30గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు గమ్యస్థానం చేరుతుంది.
సికింద్రాబాద్–తిరుపతి–సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహమూబ్‌నగర్, వనరపర్తి, గద్వాల్, కర్నూల్, ఢోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. సికింద్రాబాద్–కాకినాడ టౌన్– సికింద్రాబాద్ రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, కైకలూరు, భీమవారం టౌన్, తనకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట్ల స్టేషన్లలో స్టాప్ ఉంటాయి. నర్సాపూర్ – సికింద్రాబాద్ రైళ్లు పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్స్‌లో ఆగనున్నాయి. సికింద్రాబాద్ – నర్సాపూర్ ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట, వరంగల్, మహమూబాబాద్, ఖమ్మం, మధిర, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్స్‌లో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.