అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) 4,687 అంగన్వాడీ హెల్పర్ల పోస్టుల భర్తీ(Anganwadi Helpers Recruitment) కి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ(Women and Child Welfare Department)కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు(Orders) జారీ చేసింది. రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసిన క్రమంలో…4687 అంగన్వాడీ హెల్పర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పోస్టుల భర్తీకి పదో తరగతి విద్యార్హతగా ఉంటుంది. వీరికి గౌరవ వేతనంగా నెలకు రూ.11,500గా ఇస్తారు. ఈ కొత్త నియామకాలతో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మరింత మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అర్హతల వివరాలు
హెల్పర్ల పోస్టులకు దరఖాస్తు చేసే వారు 10వ తరగతి పాసై ఉండాలి.. అలాగే వివాహితులై స్థానికంగా నివసిస్తూ ఉండాలి. వయస్సు 2025 జులై 1 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కొన్ని ప్రాంతాల్లో 18 సంవత్సరాల నుంచి అర్హత ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో ఆయా వర్గాల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతో పాటు కుల ధృవీకరణ, నివాసం, పుట్టిన తేదీ, 10వ తరగతి మార్కులు, ఆధార్ కార్డు వంటి పత్రాలను గెజిటెడ్ అధికారి ధృవీకరణతో జత చేయాలి.
ఇటీవలి ఫొటోను దరఖాస్తుపై అతికించి, దాన్ని కూడా ధృవీకరించాలి. దరఖాస్తులను స్వయంగా లేదా పోస్ట్ ద్వారా సమర్పించవచ్చ. మరిన్ని వివరాల కోసం స్థానిక అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.