Site icon vidhaatha

కృష్ణా నదిలో చిక్కుకున్న 70 లారీలు

విధాత:నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు వద్ద కృష్ణా నదిలో తీసుకువెళ్లిన 70 లారీలు అకస్మాత్తుగా పెరిగిన వరద లో చిక్కుకోవడంతో ఆందోళన. ఇసుక లోడింగ్ కోసం లారీలు వెళ్లే లారీ డ్రైవర్లు ఎవరికి వారు తామే ముందుగా చేయించుకోవాలని పోటీపడి మరి వారిలో కి వెళ్లారు.ఈ సమయంలో రహదారి కూడా కొంత దెబ్బతిన్నది అకస్మాత్తుగా కృష్ణానదికి వరద రావడంతో లారీల నీ అక్కడ చిక్కుకున్నాయి.వరద నీటిలో తిరిగి వెనక రాలేని పరిస్థితిలో లారీలో ఉండిపోయాయి.దీంతో లారీ డ్రైవర్లు, యజమానులు ఆందోళన చెందుతున్నారు.పోలీస్ ,రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలను ఏదో ఒక రకంగా ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.

Exit mobile version