Site icon vidhaatha

మంచి పుస్తకం సంస్కారాన్ని నేర్పుతుంది,విద్యార్ధులు పుస్తకపఠనాన్ని అలవాటు చేసుకోవాలి.. సజ్జల

పద్మభూషణ్ డాక్టర్ కె ఈ వరప్రసాద్ రెడ్డి జీవితం అనుభవాలు తెలియపరుస్తూ రచించిన ‘
శాంతి పధం’ మరియు ప్రముఖ రచయిత రమణ రచించిన ‘మొగలిరేకులు’ గ్రంధాల
ఆవిష్కరణ సభలో ప్రభుత్వ సలహాదారులు( ప్రజావ్యవహారాలు)సజ్జల రామకృష్ణారెడ్డి
.

విధాత:పుస్తక పఠనం మంచి ఆలోచనలు..మంచి నడవడికను..సృజనాత్మకతను పెంపొందిస్తుంది.అంతే కాక ప్రతి వ్యక్తిలో సంస్కారాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు పుస్తకపఠనం దోహదం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.గుంటూరు జిల్లా నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో పద్మభూషణ్ డాక్టర్ కె ఈ వరప్రసాద్ రెడ్డి జీవితం అనుభవాలు తెలియపరుస్తూ రచించిన ‘శాంతి పధం‘ మరియు ప్రముఖ రచయిత రమణ రచించిన ‘మొగలిరేకులు‘గ్రంధ ద్వయ ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సభకు మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.

    సజ్జల మాట్లాడుతూ పుస్తక  రచయిత రమణ మంచి రచయితే కాక సున్నిత హాస్యం పండించగల మంచి వ్యక్తి అని అన్నారు. పుస్తక పఠనం ద్వారా విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని విద్యార్థులకు సామాజిక అంశాలను సాహిత్యం  పరిచయం చేస్తుందని అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా ఇతరులకు  దగ్గరయ్యే అవకాశం ఉందన్నారు .పద్మభూషణ్ వరప్రసాదరెడ్డి శాంతిపధం పుస్తకం విద్యార్దులకు మంచి స్పూర్తిని ఇస్తుందని అన్నారు. 

   ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రజల ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ పథకాలను సరైన రీతిలో వినియోగించటం మన బాధ్యత అని అన్నారు. వైయస్ జగన్ విద్యార్దుల భవిష్యత్తుకోసం విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటున్నిారని వాటి ఫలాలు అందిననాడు రాష్ర్టం మరింతగా పురోగమిస్తుందన్నారు.విద్య,వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని విద్యార్దులందరూ గుర్తించాలని కోరారు.

  కార్యక్రమంలో పొన్నూరు శాసనసభ్యులు కిలారి రోశయ్య,నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి ఉత్తర  అమెరికా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ  ప్రతినిధి రత్నాకర్, vvit చైర్మన్ వాసిరెడ్డి  విద్యాసాగర్ కళాశాల ప్రిన్సిపాల్,పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.
Exit mobile version