ఇవి బోగస్ పరిషత్ ఎన్నికల ఫలితాలు

విధాత‌: ఇవి బోగస్ పరిషత్ ఎన్నికల ఫలితాలు, ఎన్నికల్లో వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం వల్లే టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది.అధికారులు,పోలీసులు బరితెగించి అధికార పార్టీకి అన్ని విధాలా సహకరించి ప్రజాస్వామ్యాన్నికాల రాశారు. ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయం కాదు, ప్రజాభిప్రాయం అని వైసీపీ భావిస్తే…ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా ?వైసీపీ నాయకులు ఏకగ్రీవాల మాటున సాగించిన అరాచకం వర్ణించలేనిది.వాటిని ఎన్నికలు అనరు. అది సెలక్షన్ తప్పఎలక్షన్ కాదన్నారు కింజరాపు అచ్చెన్నాయుడు. […]

  • Publish Date - September 19, 2021 / 02:19 PM IST

విధాత‌: ఇవి బోగస్ పరిషత్ ఎన్నికల ఫలితాలు, ఎన్నికల్లో వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం వల్లే టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది.అధికారులు,పోలీసులు బరితెగించి అధికార పార్టీకి అన్ని విధాలా సహకరించి ప్రజాస్వామ్యాన్నికాల రాశారు. ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయం కాదు, ప్రజాభిప్రాయం అని వైసీపీ భావిస్తే…ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా ?వైసీపీ నాయకులు ఏకగ్రీవాల మాటున సాగించిన అరాచకం వర్ణించలేనిది.వాటిని ఎన్నికలు అనరు. అది సెలక్షన్ తప్పఎలక్షన్ కాదన్నారు కింజరాపు అచ్చెన్నాయుడు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో అడుగడుగునా చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ దిక్కరణ జరుగుతోంది.పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏవిధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందో దేశం మొత్తం చూసింది.అడ్డదారుల్లో,అక్రమాల ద్వారా ప్రజాస్వామ్య కల్పవృక్షాన్నే కబళించే స్థాయిలో వైసీపీ నేతలు వ్యవహరించారు.రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలయితే మంత్రులు నేరుగా రాజభవన్ కి వెళ్ళాల్సిందేనని, రాజకీయ భవిష్యత్ కోల్పోవాల్సి వస్తుందని జగన్ హెచ్చరించడంతో మంత్రులు,శాసనసభ్యులు గ్రామాల మీద పడి దండయాత్ర చేశారు.

మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవం చేసుకొనేందుకు అక్రమకేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురిచేశారు.ప్రజల్ని ఏం ఉద్దరించారని మీకు ఏకగ్రీవంగా పట్టం కడతారు? పుంగనూరులో 69 ఎంపీటీసీల్లో 65, తంబళపల్లిల్లో 72 కి 72 శ్రీకాళహస్తిలో 64 కి 63 ఎంపీటీసీలు వైసీపీ బలవంతంగా ఏకగ్రీవం చేసుకుంది.రాష్ట్రంలో మొత్తం ఈ విధంగా అరాచకం, దాడులు, దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అధికారంలో వున్నవారు ప్రజలకు చేసింది ఏమిటో చెప్పుకొని ఓట్లు అడుగుతారు, కానీ వైసిపి నేతలు బెదిరింపులు, దౌర్జన్యాలతో ఓటు వెయ్యకపోతే వూళ్ళో ఉండరని, మీసంక్షేమ పధకాలు రద్దు చేస్తామని, మీ ఇళ్లు కూల్చేస్తామని, అక్రమ కేసులు బనాయిస్తామని అరాచకం సృష్టించి ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్య విలువలకు సిలువ వేసారని పేర్కొన్నారు.